వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో నేడు ఇండస్ట్రియల్ రీ స్టార్ట్ ప్యాకేజీ ప్రారంభించనున్న సీఎం జగన్ .. పట్టాలెక్కనున్న పరిశ్రమలు

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది పారిశ్రామిక రంగం . ఇక లాక్ డౌన్ తో దెబ్బ తిన్న పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2014-15 నుంచి ఎంఎస్‌ఈలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని , అలాగే మినిమం కరెంట్ డిమాండ్ చార్జీలను మూడు నెలల పాటు రద్దు చెయ్యాలని, 6-8 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది . ఇక ఈ క్రమంలో లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి ఈ రీస్టార్ట్‌ ప్యాకేజీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.

ఏపీలో రైతు సంక్షేమం కోసం జగన్ మరో కీలక నిర్ణయం: నేటి నుండే అమలుఏపీలో రైతు సంక్షేమం కోసం జగన్ మరో కీలక నిర్ణయం: నేటి నుండే అమలు

ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక రంగ ప్యాకేజీ మొత్తం రూ.1,110 కోట్లు

ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక రంగ ప్యాకేజీ మొత్తం రూ.1,110 కోట్లు

ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగానికి జవసత్వాలు నింపే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం . కరోనా లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన పారిశ్రామిక రంగానికి తన వంతు సహకారం అందించటానికి సిద్ధం అయ్యింది. అందులో భాగంగా రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,110 కోట్లు అందించనుంది. ఇక ఈ ప్యాకేజీలో ముందుగా రూ.993.97 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్‌ కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 ఎంఎస్‌ఎంఈలకు చెల్లించాల్సిన బకాయిలు , ప్రోత్సాహకాలు రూ.905 కోట్లు

ఎంఎస్‌ఎంఈలకు చెల్లించాల్సిన బకాయిలు , ప్రోత్సాహకాలు రూ.905 కోట్లు

ఇక అంతేకాదు భాగంగా ఎంఎస్‌ఎంఈలకు 2014 నుండి గత ఏడాది వరకు ఉన్న ప్రోత్సాహకాల బకాయిలను రూ.905 కోట్ల చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఇక మూడు నెలల విద్యుత్‌ బిల్లులపై రూ.187.80కోట్ల మేర స్థిర విద్యుత్‌ చార్జీల మాఫీ ఇవ్వనున్నారు. 6-8 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.రాష్ట్రంలో కరోనా కష్ట కాలంలో కూడా పరిశ్రమలను ఆదుకోకుంటే పారిశ్రామిక వర్గాలు ఇబ్బంది పడతాయని గుర్తించి వారికి ఊరట కలిగే నిర్ణయాలు తీసుకున్నారు.

పాత బకాయిలు విడుదలవల్ల 11,238 ఎంఎంస్‌ఎంఈలకు లబ్ది

పాత బకాయిలు విడుదలవల్ల 11,238 ఎంఎంస్‌ఎంఈలకు లబ్ది

2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకూ టీడీపీ హయాంలో ఎంఎస్‌ఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లు చెల్లించలేదు . ఇక ఆతర్వాత ఇప్పటి వరకు మొత్తం కలిపి రూ.905 కోట్లను మే, జూన్‌ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.ఇక ఆ ప్రకటన మేరకే తాజా నిర్ణయం తీసుకున్నారు . దీంతో పారిశ్రామిక పాత బకాయిలు విడుదలవల్ల 11,238 ఎంఎంస్‌ఎంఈ యూనిట్లు లబ్ధిపొందనున్నాయి. మొత్తం పాత బకాయిలు విడుదల, విద్యుత్‌ డిమాండ్‌ చార్జీలు రద్దు, రూ.200కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుతో సుమారు 98వేల యూనిట్లకు లబ్ధిచేకూరుతుందని ఏపీ ప్రభుత్వం చెప్తోంది .

Recommended Video

AP Minister Vellampalli Srinivas Satires On Pawan Kalyan
కరోనా లాక్ డౌన్ సమయంలో పరిశ్రమలకు ఏపీ సర్కార్ చేయూత

కరోనా లాక్ డౌన్ సమయంలో పరిశ్రమలకు ఏపీ సర్కార్ చేయూత

దీంతో ఎంఎస్‌ఎంఈలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎంఎస్‌ఎంఈలకు మేలు జరుగనుంది. కరోనా లాక్ డౌన్ వల్ల ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా మూత పడకూడదని భావించిన సీఎం జగన్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు . సంక్షోభ సమయంలో ప్రస్తుతం పరిశ్రమలను ఆదుకుంటే ఆ నమ్మకంతో కొత్త పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు . అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా ఇండస్ట్రియల్ రీ స్టార్ట్ ప్యాకేజీ ప్రకటించి సీఎం జగన్‌ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు .

English summary
The industrial restart package will be launched by Chief Minister Jagan Mohan Reddy today to cover the industrial sector affected by the lockdown. The total package is Rs. 1,110 crores .the package was earlier issued by the Special Secretary General of Industries, Karikala Valavan, giving administrative approval for the release of Rs 993.97 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X