• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు..! పోలవరం పై సీఎం జగన్‌ సమీక్ష..!!

|
  ప్రాజెక్టుల్లో అవినీతి... జరగడానికి వీల్లేదన్న జగన్!! || Oneindia Telugu

  అమరావతి/హైదరాబాద్ : టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని, ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నానని పేర్కొన్నారు. కళ్లు మూసుకోండని తనపైనా ఒత్తిడి తెచ్చారని అన్నారు.

  అలాచేయదలుచుకోలేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధం అయ్యానన్నారు. ఇలాంటి స్కాంలను సమర్థించకుండా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఒక మెసేజ్‌ వెళ్లాలని పేర్కొన్నారు. నీటి పారుదల అదికారులతో పోలవరం ప్రాజెక్టు పై ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

   పోలవరం ప్రతిష్టాత్మకం..! పారదర్శకంగా పని చేయాలన్న ఏపి సీఎం..!!

  పోలవరం ప్రతిష్టాత్మకం..! పారదర్శకంగా పని చేయాలన్న ఏపి సీఎం..!!

  పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 100 రూపాయల పని 80 రూపాయలకే పని జరుగుతుందంటే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్దామన్నారు. అలా చేస్తే అధికారులను సన్మానిస్తాన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ఎక్కడ చేయగలమో గుర్తించండని సూచించారు. ఏపీ ప్రభుత్వం పారదర్శకత దేశానికి ఒక సంకేతం పంపాలని తెలిపారు. అందుకోసమే జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటును కోరామని పేర్కొన్నారు. పోలవరంలో అనేక అవకతవకలను ప్రస్తావించారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం మీడియాలో వచ్చిన అంశాలను ప్రస్తావించారు సీఎం జగన్.

   అక్రమాలకు చెక్ చెప్పండి..! విశ్వసనీయత పెంచాలన్న జగన్..!!

  అక్రమాలకు చెక్ చెప్పండి..! విశ్వసనీయత పెంచాలన్న జగన్..!!

  పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి ఆదేశించామని జగన్ తెలిపారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందన్నారు. అవినీతిని సహించబోమని పైనుంచి కింది స్థాయి వరకూ గట్టి సంకేతం పోవాలన్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించంచాలన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని విమర్శించారు. స్పిల్‌వే పూర్తిచేయకుండా కాఫర్‌ డ్యాంకు వెళ్లారని, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారన్నారు. ఫలితంగా గోదావరిలో వెడల్పు తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పడు భారీగా వరద వస్తే 4 నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విమర్శించారు. పోలవరం తనకు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టు అని చెప్పారు.

   దేశానికే ఆదర్శంగా నిలవాలి..! పనుల్లో వేగం పెంచాలన్న సీఎం..!!

  దేశానికే ఆదర్శంగా నిలవాలి..! పనుల్లో వేగం పెంచాలన్న సీఎం..!!

  ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరగడానికి వీల్లేదని, టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంజనీరింగ్‌ పనుల్లో గత ఐదేళ్లలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ప్రభుత్వ పనుల్లో విశ్వశనీయత తీసుకురావాలని చెప్పారు. అవినీతిని ఆస్కారం లేదన్న సందేశం పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని పునరుద్ఘాటించారు. రివర్స్‌ టెండరింగ్‌ ఎక్కడ చేయగలమో గుర్తించాలన్నారు. పారదర్శకతలో ఏపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలవాలని, అందుకోసమే జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరినట్టు వెల్లడించారు.

  పోలవరాన్ని గందరోగోళం చేసిన టీడిపి..! కాపర్ డ్యాం ఎందుకన్న జగన్..!!

  పోలవరాన్ని గందరోగోళం చేసిన టీడిపి..! కాపర్ డ్యాం ఎందుకన్న జగన్..!!

  పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను సమావేశంలో సీఎం జగన్‌ ప్రస్తావించారు. పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి ఆదేశాలిచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని.. స్పిల్‌వే పూర్తిచేయకుండా కాపర్‌ డ్యాంకు వెళ్లారు, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారని వివరించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tender system should be made more transparent, corruption in projects is not possible, said CM YS Jagan. Claimed to be desperate to repair a spoiled system. He said that he put pressure on his eyes. He did not want to do so because he was prepared to fight against corruption.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more