విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ వద్ద మోకాళ్లపై ఐఏఎస్ - ప్రముఖుల సమక్షంలో ఇలా : అసలేం జరిగింది..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల వేళ ఒక ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ జెండా ఆవిష్కరించారు. ఆ ఉత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులు..రాజకీయ - అధికార ప్రముఖులు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. సీఎం జగన్ వద్దకు ఆయన కార్యాలయ అధికారులు రావటం...ఆయనకు అందించాల్సిన సమచారం ఇవ్వటం జరుగుతూనే ఉంది. అదే సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

సీఎం సీటు పక్కనే మోకాళ్లపై ప్రవీణ్ ప్రకాశ్

సీఎం సీటు పక్కనే మోకాళ్లపై ప్రవీణ్ ప్రకాశ్

సీఎం జగన్ తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను పిలిచారు. ఏదో అంశం పైన ప్రశ్నించారు. దానికి ప్రవీణ్ ప్రకాశ్ సమాధానం ఇచ్చే సమయంలో ..సీఎం కూర్చున్న సీటు పక్కనే మోకాలిపైన కూర్చుకున్నారు. అలాగే సీఎం అడిగిన సమాచారం అందించారు. ఆ సమయంలో తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఐఏఎస్ అధికారి సమీపంలోనే అంత మంది ప్రముఖులు ఉండగా.. ఇలా మోకాళ్ల పైన కూర్చొని సీఎంతో చర్చించటం పైన భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. జగన్ కార్యాలయంలో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తూ

సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తూ

ముఖ్యమైన నిర్ణయాల్లో ఆయనదే కీలక భూమిక. సీఎంకు సంబంధించిన కీలక వ్యవహారాలు..అదే విధంగా ఏపీ పునర్విభజన చట్టం వ్యవహారాలు.. కేంద్రం - రాష్ట్ర మధ్య అధికారిక సంప్రదింపుల బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఇప్పుడు దీని పైన అధికార వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో అక్కడి కలెక్టర్ వెంకటరామిరెడ్డి సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేసారు. తన తండ్రి సమానులు కావటంతో ఆయనకు పాదాభివందనం చేసానంటూ ఆయన సమాధానం ఇచ్చారు.

Recommended Video

PRC Issue In AP: సమ్మె వద్దు.. చర్చించుకుందాం AP Govt VS Employees | Oneindia Telugu
వైరల్ అవుతున్న తాజా ఫొటో

వైరల్ అవుతున్న తాజా ఫొటో

ఇక, తాజాగా ఆయనకు ఎమ్మెల్సీగా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. వెంకట రామి రెడ్డి తన ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకొని..టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక, ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ - ఫొటో వ్యవహారం వైరల్ అవుతోంది. అయితే, సీఎం వెనుకే సీఎంఓ అధికారులు..భద్రతా అధికారులు ఆసీనులై ఉన్నారు. సీఎంకు మరో వైపు ఎంపీ బాలశౌరి కూర్చుకున్నారు. సీఎంకు వివరంగా సమాధానం ఇచ్చేందుకే ప్రవీణ్ ప్రకాశ్ అలా ముందుకు కూర్చొని సమాచారం ఇచ్చారనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.

English summary
CMO Principal Secretary Praveen Prakash sitting on knees in front of CM JAgan became viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X