వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : APTDP 40-90 సీట్లు,YSRCP 110-140 సీట్లు ఏపీలో వైసీపీ,టీడీపీ హోరాహోరీ

న్యూఢిల్లీ: ఏడు దఫాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏపీలో గత నెల (ఏప్రిల్) 11వ తేదీన అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ముగియగా, తెలంగాణలోను అదే రోజున లోకసభ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమైన ఎన్నికలు నేటి (మే 19)తో ముగిశాయి. ఈ నేపథ్యంలో దేశంలో, ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే ఉత్కంఠ అందరిలోను నెలకొని ఉంది. అందరూ ఎగ్జిట్ పోల్స్ వైపు చూస్తున్నారు.

CNN-న్యూస్18 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారం. 2014లో బీజేపీ, జనసేన పొత్తు కారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ 67 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు జనసేన ఒంటరిగా బరిలోకి దిగింది. దీంతో త్రిముఖ పోరు నెలకొని ఉందని భావించారు. అయితే ఎగ్జిట్ ఫలితాలు కొంత వైసీపీ వైపు మొగ్గు చూపాయి.

ఏపీలో లోకసభ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా...

YSR Congress - 13-14 ఎంపీ స్థానాల్లో గెలుపు
Telugudesam - 10-12 ఎంపీ స్థానాల్లో గెలుపు
BJP - 0- 1 ఎంపీ స్థానాల్లో గెలుపు
Janasena - 0
Congress - 0

CNN exit polls 2019: YSRCP wins in 13-14 Lok Sabha, TDP wins 10-12 LS seats in AP

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి అధికారం దక్కదని చెబుతున్నాయి. జనసేనకు కనీసం డబుల్ డిజిట్ కూడా రాదని తెలుస్తోంది. జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 110 - 140 సీట్ల మధ్య వస్తున్నాయని, టీడీపీకి 40 నుంచి 90 సీట్ల వరకు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో (2014) న్యూస్ 24-చాణక్య, మ్యాప్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు (లోకసభ ఫలితాలు) ఆ తర్వాత వచ్చిన అసలు ఫలితాలకు కాస్త దగ్గరగా ఉన్నాయి. ఎన్డీయేకు 340, యూపీఏకు 70 సీట్లు వస్తాయని న్యూస్24-చాణక్య, ఎన్డీయేకు 330, యూపీఏకు 91 సీట్లు వస్తాయని మ్యాప్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వేలు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చెప్పాయి. ఇండియా టీవీ-సీఓటరు ఎన్డీయేకు 289, యూపీఏకు 101, ఏబీపీ-నీల్సన్ ఎన్డీయేకు 281, యూపీఏకు 97, సీఎన్ఎన్-ఐబీఎన్-సీఎస్‌డీఎస్ ఎన్డీయేకు 272-280, యూపీఏకు 92-102, టైమ్స్ నౌ-ఓర్‌జీ ఎన్డీయేకు 249, యూపీఏకు 148 సీట్లు వస్తాయని చెప్పాయి.

English summary
CNN predicted that YS Jagan Mohan Reddy's YSR Congress Party will win 13-14 Lok Sabha seats, Chandrababu Naidu's Telugudesam Party will win 10-12 Lok Sabha seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X