వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంపులో మగ్గుతున్న గోదావరి తీర ప్రాంతాలు..! భయం గుప్పిట్లో వందల గ్రామాలు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ముంపుకి గురైన గోదావరి తీర ప్రాంతాలు|Due To The Flood, Many Coastal Villages Still In The Water

ద్రాచలం/హైదరాబాద్ : గోదావరికి పెరిగిన వరద కారణంగగా తీరగ్రామాలు ఇంకాముంపులోనే ఉన్నాయి. మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వరద ముంపులో 420 గోదావరి తీరప్రాంత గ్రామాలు ఉండగా.. పునారావాస కేంద్రాల్లో 19వేలమందికిపైగా బాధితులున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం, మంత్రులు సమీక్షిస్తున్నారు.

గోదావరికి వరద ఉద్ధృతి తగ్గుతూ, పెరుగుతూ ఉంది. తెలంగాణలోని గోదావరి పరీవాహకంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండటంతో.. నీటిని దిగువకు వదులుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 81 గేట్లను ఎత్తి దిగువకు 7.97 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అన్నారం బ్యారేజీలో తొమ్మిది గేట్లను ఎత్తి నీళ్లను వదలారు. సుందిళ్ల బ్యారేజీ 18 గేట్లు ఎత్తారు. దీంతో భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. గోదావరి నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. సోమవారం సాయంత్రానికి వరద 43 అడుగులకు చేరుకోవడంతో.. మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.గోదావరికి వరద కాస్త తగ్గుముఖం పట్టినా.. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. దేవీపట్నంలో మాత్రం పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. అలాగే పోలవరం ముంపు.. గోదావరి తీర, లంక గ్రామాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. మళ్లీ భద్రాచలం దగ్గర వరద పెరగడంతో భయం మొదలయ్యింది.

coastal areas, ap government, cm Jagan, river Godavari, Hundreds of villages, flood effected areas.

ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లెక్కల ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలోని 420 గ్రామాల్లో దాదాపు లక్షమందికిపైగా ప్రజలు వరద బారిన పడ్డారు. వీరిలో 19వేలమందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా దేవీపట్నం, పోలవరం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వరద దెబ్బకు దాదాపు 109 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరదల కారణంగా దాదాపు 17వేల ఇళ్లు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో.. వరద ప్రభావిత గ్రామాల్లో బియ్యం, కిరోసిన్, నూనె, కందిపప్పు వంటి నిత్యావసరాలను అందిస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద పరిస్థితి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష చేస్తున్నారు.

English summary
Due to the flood of Godavari, the coastal villages are still in the river. Once again, a first threat warning was also issued. Most of the villages in the Godavari districts are still in the dip. The victims are seeking refuge in rehabilitation centres. There are 420 Godavari coastal villages in this flood. There are more than 19 thousand victims in the rejuvenation centres. The situation is being reviewed by the PM and ministers regularly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X