వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోస్ట‌ల్ బ్యాంకు ఛైర్మ‌న్ జ‌య‌రాం అనుమానాస్ప‌ద మృతి : హ‌త్య‌గా అనుమానం ..!

|
Google Oneindia TeluguNews

ఎన్నారై..కోస్ట‌ల్ బ్యాంకు ఛైర్మ‌న్ చిగురుపాటి జ‌య‌రాం అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు. తెల్లవారు జామున కారు లోని మృత‌దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు స‌మాచారం అందించారు. కారు వెనుక సీట్లో మృత‌దేహం ప‌డి ఉంది . ఇది..ప్ర‌మాద‌మా..లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.

జ‌య‌రాం అనుమానాస్ప‌ద మృతి..
కోస్టల్ బ్యాంకు చైర్మన్‌, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర హైవేపై కారులో జయరామ్‌ మృతదేహం లభ్యమైంది. అమెరికాలోని తెలుగు వారందరికీ సుపరిచితమైన ఎన్నారై చిగురుపాటి జయరాం మృతి పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కారులో వెను క సీట్లో కూర్చొని ఉన్న ఆయ‌న త‌ల‌కు బ‌ల‌మైన గాయాల‌య్యాయి. తెల్లవారుజామున కారులోని మృత దేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కారులో ఉన్నది చిగురుపాటి జయ రాం అని గుర్తుపట్టిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి వ్యవహారాల విషయంలో గొడవలు ఏమైనా ఉన్నాయా..అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Coastal Bank Chairman Jayaram mysterious Death..

న్యూయార్క్ లోనే చ‌దువు..
జ‌య‌రాం స్వ‌స్థలం విజ‌య‌వాడ‌. ఆయ‌న న్యూయార్క్‌లో చదువుకున్నారు. అక్కడే స్థిరపడి అంచలంచెలుగా ఎది గారు. వ్యాపార రంగంలో ప్ర‌వేశించిన ఆయ‌న కోస్ట‌ల్ బ్యాంకు చైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ టీవీని కూడా స్థాపిం చారు. ఆ తర్వాత నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. అయితే కారు లో మృత‌దేశం గుర్తించిన పోలీసులు.. అయితే కారు డ్రైవర్ ఏమయ్యాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం కృష్ణా జిల్లాలో క‌ల‌క‌లం రేపుతోంది.

English summary
Coastal Bank Chairman qnd NRI Chigurupati Jayaram dead body found on High way near Nandigama mandal itavaram. Police started enquiry on this suspected death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X