• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శభాష్ గల్లా జయదేవ్..!అధికార పార్టీ ఎంపీలు చేయలేని పని మీరు చేసారు..!సహచరుల పొగడ్తలు..!!

|

అమరావతి/హైదరాబాద్ : భారత చిత్ర పఠంలో అమరావతికి గుర్తింపు లభించింది. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తే భారత చిత్రపఠంలో పొందుపరిచారు. దీంతో అమరావతికి దేశ వ్యాప్తంగా గుర్తిపు వచ్చినట్టు స్పష్టమవుతోంది. అయితే ఈ తంతంగం వెనక ప్రతిపక్ష పార్టీకి చెందని ఓ ఎంపీ పాత్ర కీలంగా ఉందని తెలుస్తోంది. అమరావతి గురించి ఆ ఎంపీ తీసుకున్న చొరవ, పార్లమెంట్ లో చేసిన ప్రతిపాదన వల్ల భారత చిత్ర పఠంలో అమరావతికి స్థానం దక్కిందనే చర్చ జరుగుతోంది. తెలుగుదేవం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ తీసుకున్న చర్యల వల్లే కేంద్ర ప్రభుత్వం అమరవతికి తగిన గుర్తింపునిచ్చిందని సహచర ఎంపీలు ఆయనను ప్రశంశిస్తున్నారు.

అదిగదిగో అమరావతి: సరికొత్త మ్యాప్ ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..!

 అమరావతికి గుర్తింపు.. భారతదేశ మ్యాప్ లో పొందుపరిచిన కేంద్రం..

అమరావతికి గుర్తింపు.. భారతదేశ మ్యాప్ లో పొందుపరిచిన కేంద్రం..

ఇదిలా ఉండగా కేంద్రం ప్రభుత్వం మ్యాప్ లో అమరావతిని పొందుపరచడం మరిచిపోయింది. అప్పుడు వెంటనే ఏం జరగాలి..? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి తగు సూచనలు, ప్రతిపాదనలు చేస్తూ లేఖ రాయాలి. జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలి. వెంటనే అమరావతిని రాజధానిగా పొందుపరుస్తూ కొత్త మ్యాప్ కోసం డిమాండ్ చేయాలి. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం ఆ పనిచేయలేకపోయింది. చట్ట సభల్లో అధికార పార్టీ ఎంపీలు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఎంపీలే దీనిపట్ల చొరవ తీసుకునప్నారనే చర్చ జరుగుతోంది.

 అమరావతి గురించిన ప్రశ్నించిన టీడిపి ఎంపీ.. స్పందించిన కేంద్ర హోం శాఖ..

అమరావతి గురించిన ప్రశ్నించిన టీడిపి ఎంపీ.. స్పందించిన కేంద్ర హోం శాఖ..

పార్లమెంటులో ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా గట్టిగా కేంద్రాన్ని నిలదీశారు. అంతే మరుసటి రోజే ఏపీ రాజధాని అమరావతిని పొందుపరుస్తూ మ్యాప్ ను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దుతో పాటు, జమ్ముకశ్మీర్ కు సంబంధించిన తాజా మార్పులతో కొత్త మ్యాప్ విడుదల అనివార్యమైంది. ఈ సందర్భంగా మ్యాప్ లో అన్ని రాష్ట్రాల రాజధాని నగరాలు పేర్కొన్నప్పటికీ, ఏపీ రాజధానిగా మాత్రం అమరావతిని పేర్కొనలేదు. దీంతో పలు భిన్నాభిప్రాయాలు తెర మీదకు వచ్చాయి. కొద్ది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజధానిపై ఒక కమిటీని ఏర్పాటు చేయడం, అమరావతి స్థానే మరో రాజధానిని ప్రకటిస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

 టీడిపి ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావన.. అమరావతి గురించి స్పందించిన కిషన్ రెడ్డి..

టీడిపి ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావన.. అమరావతి గురించి స్పందించిన కిషన్ రెడ్డి..

అమరావతి రాజధాని అంశంలో ఏపి ప్రజలు ఓ రంకంగా అయోమయంలో ఉన్నారు. రాజధాని ఉంటుందా.? ఉండదా అనే సందేహంలో కాలం వెళ్లదీసిరు. అదే సమయంలో కేంద్రం విడుదల చేసిన మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతి లేకపోవటంతో అగమ్యగోచర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఇలా ఉన్న సందర్బంలో గురువారం జరిగిన లోక్ సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఇటీవల సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించకుండా మ్యాప్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. దీని పట్ల కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది.

 ప్రశంసలందుకుంటున్న జయదేవ్.. ట్వీట్ చేసిన నారా లోకేష్..

ప్రశంసలందుకుంటున్న జయదేవ్.. ట్వీట్ చేసిన నారా లోకేష్..

గల్లా జయదేవ్ సంధించిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ. కిషన్ రెడ్డి స్పందిస్తూ, త్వరలోనే సవరించిన మ్యాప్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా శుక్రవారం రాత్రి వేళలో సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఇందులో గతంలో దొర్లిన తప్పును సరిదిద్దుకుంది. ఏపీ రాజధాని నగరంగా అమరావతితో కూడిన మ్యాప్ విడుదలైంది. త్వరలోనే విడుదల చేస్తామని కిషన్ రెడ్డి చెప్పినప్పటికీ, 24 గంటలు గడవక ముందే సవరించిన మ్యాప్ ను విడుదల చేయటం పట్ల సర్వత్రా హర్షం, ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఆండ్ ది క్రెడిట్ గోస్ టు టీడిపి ఎంపీ గల్లా జయదేవ్ అంటున్నారు ఏపి ప్రజలు.

English summary
The MP's initiative about Amaravati, the proposal made in Parliament, is a debate that Amaravati has been ranked in the Indian Map reading. Fellow MPs praise the central government for its recognition of the action taken by the Telugu Desam Party MP Galla Jayadev.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X