వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టర్,ఎస్పీలు ప్రతి వారం కాఫి తాగుతూ భూ సమస్యలు చర్చించాలి : సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ప్రజలకు సమస్యలు లేని పరిపాలనను కొనసాగించడంలో అధికారులదే ముఖ్యపాత్ర ,అయితే .... జిల్లా అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రజల సమస్యల పెండింగ్‌కు కారణం అవుతుంటాయి.. అయితే ఇక ముందు ఇలాంటీ అధికారుల మధ్య సమన్యయ లోపం లేకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓ మార్గాన్ని సూచించారు. ప్రతివారానికి ఓసారి జిల్లా ఉన్నతాధికారులు కలుసుకునేలా కాఫి టుగెదర్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా జిల్లాకు బాస్‌లు అటు ఎస్పి ఇటు కలెక్టర్లు, శాంతిభద్రతలతో పాటు సాధరణ పరిపాలన కొనసాగేందుకు ఇద్దరు వ్యక్తులు కీలక బాధ్యతలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్‌ కార్యక్రమం పేరుతో ప్రతివారం కలుసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సూచించారు.

collectors and SPs should join in the name of Coffee Together address land issues:cm jagan

ముఖ్యంగా భూ వివాదాలు ఎక్కువగా నేపథ్యంలోనే ప్రతి మంగళవారం ఆయా జిల్లాల 'కలెక్టర్‌లు, ఎస్పీలు కాఫీ టుగెదర్' పేరుతో కలుసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇద్దరు అధికారులు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. కాగా ఇద్దరు అధికారులు ఇచ్చిపుచ్చుకున్న జాబితాను మరునాడు ఆయా మండల తహశీల్దార్లకు పంపించాలని చెప్పారు. ఇక మరుసటి రోజు అనగా గురువారం తహసీల్దార్లు ఎస్సై,తోపాటు సర్వేయర్లు,ఆర్‌ఐలతో తోపాటు వీఆర్వోలు కలిసి చర్చించాలని చెప్పారు. ముఖ్యంగా భూవివాదాలు శాంతి భద్రత సమస్యలను సృష్టిస్తున్నాయని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను ప్రకాశం జిల్లా అధికారులు చేయగా అవి బాగున్నాయని జగన్ కితాబు ఇచ్చారు. రాష్ట్రంలోని మిగతా అధికారులు కూడ వీటీని ఫాలో కావాలని సూచించారు.

English summary
Districts 'collectors and SPs should join in the name of Coffee Together'said ap cm jagan.Collectors and SPs meet weekly to address land issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X