వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus సోకిన వారిని కలెక్టర్లే ఆస్పత్రికి తీసుకురావాలి,ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు:ఏపీ సీఎం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయా జిల్లాల్లో ఐఏఎస్‌లే వైరస్ బాధితులకు చికిత్స అందించాలని కోరారు. సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు తెలియజేశారు.

సాయం చేయండి..

సాయం చేయండి..

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ తెలిపారని కన్నబాబు వివరించారు.. ట్రస్ట్, ఎన్జీవో, కార్పొరేట్‌ సంస్థ అధినేతలు సాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. సర్జికల్‌, ఎన్‌95 మాస్క్‌లు, పీపీఈ యూనిట్లు, మొబైల్ ఎక్స్‌రే మిషన్లు, వెంటిలేటర్లు, శానిటైజర్ల రూపంలో సాయం చేయాలని అభ్యర్థించారు. ఎంబీబీఎస్‌ డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది సేవ చేయాలని ఇన్వైట్ చేశారు. క్వారంటైన్, ఐసోలేషన్‌ వద్ద పనిచేయడానికి నాన్‌ మెడికల్‌ వాలంటీర్లు అవసరం ఉంది అని, ఔత్సహికులు రావాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు కీలకమైన రవాణా సాయం చేయడానికి కూడా ప్రజలు ముందడుగు వేయాలన్నారు.

ఆంక్షలు లేవు

ఆంక్షలు లేవు


రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై ఎలాంటి నిషేధం లేదని మంత్రి కన్నబాబు వివరించారు. శానిటేషన్ సిబ్బందిని మాస్కులు అందించాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సరుకులు తీసుకునే విషయంలో రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం మాత్రం పాటించాలని స్పష్టంచేశారు. అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తాయని పేర్కొన్నారు.

Recommended Video

AP Lock Down: Buddha Venkanna Remarks On AP CM Jagan | శవాలపై పేలాలు ఏరుకున్న వారు ఎవరు?
ఎక్కవ ధరకు విక్రయిస్తే..

ఎక్కవ ధరకు విక్రయిస్తే..

లాక్ డౌన్ సందర్భంగా వ్యాపారులు ఎమ్మార్పీ ధరకే సరుకులు విక్రయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిత్యావసరాలను ఎక్కువ ధరకు విక్రయిస్తే సంబంధిత వ్యాపారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రేషన్ షాపులను వికేంద్రీకరించే యోచన చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. నియోజకవర్గాల్లో కూడా కరోనా మానిటరింగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వృద్దశ్రమాలు, అనాధ ఆశ్రమాలకు ఉచితంగా బియ్యం, కంది పప్పు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు తెలిపారు.

English summary
district collectors key role to virus Prevention andhra prasesh chief minister jagan mohan reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X