హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నీరు: హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై కాలేజి మేనేజ్‌మెంట్

|
Google Oneindia TeluguNews

College management responded on Himachal incident
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంపై బాచుపల్లి విజ్ఞాన్ జ్యోతి కాలేజి యాజమాన్యం స్పందించింది. బియాస్ నదిలో తమ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతవడం తమకు ఎంతో బాధ కలిగించిందని కళాశాల బోర్డ్ మెంబర్ వెంకటేశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అంటూ కన్నీటి పర్యాంతమయ్యారు.

ప్రభుత్వం, అధికారులు, మీడియా అందరూ కలిసి తమ విద్యార్థులను తిరిగి సురక్షితంగా తీసుకువాలని వెంకటేశ్వర్ రావు అభ్యర్థించారు. న్యూస్ ఛానళ్లలో వచ్చిన వార్తలను చూసి తనకు కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. దీంతో వెంటనే తాను ప్రధాని కార్యాలయంలో పని చేసే కోడె దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. అతను భూటాన్‌లో ఉండటంతో ఇక్కడ ఉన్న మరో వ్యక్తిని సంప్రదించాలని కోరినట్లు చెప్పారు.

తాను ఫోన్ చేసే లోపే దుర్గాప్రసాద్ కేంద్ర ప్రభుత్వ అధికారులను, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారని వెంకటేశ్వర్ రావు తెలిపారు. తమకు సహాయం చేయాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. చిన్న వయస్సులో ఉన్న తమ విద్యార్థులకు బదులు.. దేవుడు తనను తీసుకుపోయినా బాగుండేదని కన్నీటి పర్యాంతమయ్యారు.

వార్తా ఛానళ్ల నుంచే ఎక్కువ సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు. ఘటనా స్థలానికి తమ కళాశాల లెక్చరర్లను కూడా పంపించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
తమ విద్యార్థి, ఎంపి కవిత కూడా తమ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి సహాయం చేస్తామని చెప్పారని తెలిపారు.

కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యానికి పాల్పడలేదని తెలిపారు. తమ లోపం లేదని అన్నారు. వారు విహారయాత్రకు వెళ్లే ముందు విద్యార్థులకు ఇన్స్యురెన్స్ కూడా చేయించామని చెప్పారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు సహాయం అందిస్తామని చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకుని తమ బిడ్డలను మా కళాశాలలో చేర్చారని.. ఇప్పుడు వారు ఇలా ప్రమాదంలో చనిపోవడం చాలా బాధగా ఉందని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary

 Bachupally Vignan Jyothi College management on Monday responded on Himachal Pradesh incident. In this incident 24 students were displaced. Four students died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X