వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి ఉద్యోగులకు రంగు పడుద్దంట...చూసుకోండి మరి అంటున్నఎసిబి డిజిపి

అవినీతి నిరోధానికి ఎసిబి సరికొత్త ప్రణాళిక సిద్దం చేసింది. అవినీతి ఉద్యోగులకు వారి కరప్షన్ తీవ్రతను బట్టి రంగుల గ్రేడ్లు కేటాయించనుంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి నిరోధానికి ఎసిబి సరికొత్త ప్రణాళిక సిద్దం చేసింది. అవినీతికి పాల్పడే ఉద్యోగులకు వారి కరప్షన్ రేంజ్ ని బట్టి మూడు రంగుల గ్రేడ్ లు కేటాయించనున్నారు. ఆ ఉద్యోగులపై నిరంతర నిఘా ఉంచి వారిలో మార్పుని బట్టి రంగు మారుస్తారు. తీరు మార్చుకోని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఎసిబి డిజిపి ఠాకూర్ ఈ వివరాలు వెల్లడించారు.

 రంగుల కేటాయింపు ఇలా...

రంగుల కేటాయింపు ఇలా...

ఉద్యోగుల అవినీతి తీవ్రతను బట్టి రంగుల కేటాయింపు ఇలా ఉంటుంది.

రెడ్: అత్యంత అవినీతి పరులకు ఎరుపు రంగు రేటాయిస్తారు. లంచాల కోసం ప్రజల్ని పీక్కుతినే టైప్ అధికారులను ఈ రెడ్ కలర్ జాబితాలో చేరుస్తారు. వ్యవస్థకు వీరు చీడపురుగులు లాంటి వారు కాబట్టి వీరిని ఈ కలర్ రేంజ్ లో ఉంచి తీరు మార్చకోకపోతే రెడ్ కలర్ కంటిన్యూ చేస్తారు. ఆ తరువాత వీరిని దాడులు చేసి పట్టుకోవడమే కాదు అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటారు.

ఆరెంజ్: ఎరుపు రంగు జాబితాలోని ఉద్యోగుల కార్యకలాపాలను కొంతకాలం పాటు పరిశీలిస్తారు. వారిలో ఏమైనా మార్పు వచ్చి తీరు మార్చుకుని అవినీతి తగ్గించుకుంటే వారిని రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ కలర్ డివిజన్ లోకి తెస్తారు. వీరిపై నిఘా కొనసాగుతుంది. కొంతకాలం అవినీతిని ఆపి ఆ తరువాత మళ్లీ మొదలుపెడితే వీరిపైనా దాడులు జరుగుతాయి. చర్యలు షరామామూలే.

గ్రీన్ : బాగా అవినీతిపరుడైన ఉద్యోగి కరప్షన్ వదిలేసి పూర్తి నిజాయతీపరుడుగా మారితే వారిని పచ్చ రంగు జాబితాలో చేరుస్తారు.
ఇదండీ ఉద్యోగులకు రంగు పడే విధానం..

 ఉద్యోగులపై నిఘా

ఉద్యోగులపై నిఘా

ఇలా రంగుల కేటాయింపు జరిపిన తరువాత అవినీతి ఉద్యోగులు ఆరు నెలల్లో తమ పద్ధతులను మార్చుకోవాలని అన్ని గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ ల్లోనూ విస్తృత ప్రచారం చేస్తారు. మారకపోతే ఏసీబీకి పట్టుబడక తప్పదనీ హెచ్చరిస్తారు. ఆ తరువాత వివిధ రూట్ల లో ఆయా ఉద్యోగుల గురించి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి డిపార్ట్ మెంట్ ల వారీగా అవినీతిపరుల లిస్ట్ సిద్ధం చేస్తారు. ఆధారాలు కోసం వారి వ్యవహారాలపై కొన్ని నెలలపాటు నిఘాపెడతారు. అవినీతిలో మార్పులేకుంటే నివేదిక సిద్ధం చేసి దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. అవినీతి ఉద్యోగుల్లో మార్పు తీసుకురావడం కోసమే ప్రయోగాత్మకంగా ఈ రంగుల విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ఏసీబీ డీజీ ఆర్‌.పి.ఠాకూర్‌ తెలిపారు.


ఎసిబి ప్రోగ్రెస్ రిపోర్ట్..
నవంబర్ 2016 నుంచి 2017 నవంబర్ 20 వరకు ఎసిబి 303 కేసులు నమోదు చెయ్యగా ఈ అవినీతి కేసుల్లో 65 శాతం మందికి శిక్షలు పడటం తాము సాధించిన విజయమని ఈ సందర్భంగా ఎసిబి డిజిపి ఠాకూర్ చెప్పారు. అవినీతి కేసులకు సంబంధించి మొత్తం 39 మంది దోషులుగా తేలగా వారిలో 17 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, 9 మందికి రిటైర్మెంట్ అనంతరం పెన్షన్‌ నిలిపివేయడం జరిగిందని తెలిపారు. అవినీతిలో రెడ్‌ గ్రేడ్‌ లో ఉండే ఉద్యోగులు పరివర్తన చెంది ఆరంజ్‌, గ్రీన్‌లకు మారాలని ఆయన సూచించారు. కలర్ గ్రేడ్లలని బట్టి ఉద్యోగులపై ఆరునెలల పాటు నిఘా వేసి, తీరుమార్చుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.

 అవినీతిలో మన స్థానం...

అవినీతిలో మన స్థానం...

గత సంవత్సరం దేశ వ్యాప్తంగా అవినీతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉండగా ఈ ఏడాది 19వ స్థానానికి తగ్గినట్లు ఠాకూర్‌ తెలిపారు. అవినీతి రహిత సమాజం కోసం సిఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని, ఆయన దిశానిర్దేశంలో తమ వంతు కృషి చేస్తున్నామని ఎసిబి డిజిపి చెప్పారు.

అవినీతిని అంతమొందించేందుకు...
అవినీతిని రూపుమాపాలంటే అవినీతికి ఆస్కారంలేని వ్యవస్థ అవసరమని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే లక్ష్యంతో కొన్ని సూచనలతో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నామని ఠాకూర్‌ తెలిపారు. అవినీతి గురించి వాట్స్‌ అప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవడంతో పాటు టోల్‌ఫ్రీ నంబర్లు 1064 మరియు 1100 సహా అనేక పద్దతుల ద్వారా అవినీతి గురించి సమస్త సమాచారాన్ని సేకరించి, దాన్ని విశ్లేషిస్తామని వెల్లడించారు. తద్వారా అవినీతికి సంబంధించి వ్యవస్థలో ఉన్నలోపాలను సరిదిద్దేందుకు వీలుగా ప్రభుత్వానికి సూచనలు చేయడం జరుగుతందని తెలిపారు. మరోవైపు అవినీతిని తగ్గించడానికి సాధారణ ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

 ఎసిబి ప్రత్యేక కోర్టులు...

ఎసిబి ప్రత్యేక కోర్టులు...

అవినీతిపరుల వద్ద గుర్తించిన కోట్ల రూపాయల అక్రమాస్తుల గురించి సమగ్రంగా విచారించి, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసేందుకు వీలుగా రాష్ట్రంలో నాలుగు చోట్ల ఎసిబి ప్రత్యేక కోర్టులు వస్తున్నాయని ఠాగూర్ తెలిపారు. సిబ్బంది నియామకం జరిగి త్వరలోనే ఆ కోర్టుల పని ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఆ కోర్టుల ముందు తొలి విడతగా పది మంది అక్రమాస్తుల వివరాలను ఉంచబోతున్నామని చెప్పారు.

సొంత భవనాల్లోనే..
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఎసిబి కార్యాలయాల కోసం సొంత భవనాలు నిర్మాణంలో ఉన్నట్లు ఎసిబి ఛీఫ్ ఠాకూర్ తెలిపారు. వీటి కోసం ప్రభుత్వం రూ.15.94 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. తిరుపతి, ఏలూరుల్లోని భవనాల నిర్మాణం పూర్తయి ఇప్పటికే కార్యాయాలు ప్రారంభమయ్యాయని, విశాఖ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని ఠాగూర్ తెలిపారు.

English summary
The Anti-Corruption Bureau (ACB) registered 303 cases and 39 officers were convicted by the courts between November 2016 and November 20 this year, said its Director General R.P. Thakur at a press conference here on Wednesday.Seventeen corrupt officials, who were trapped, had been terminated from service as their guilt was proved under the Prevention of Corruption Act, 1988, said Mr. Thakur. “The ACB has given the ‘Red’ (Most corrupt officers harassing the public), ‘Orange’ (corrupt officials) and ‘Green’ (good) categories to staff in the government departments and officers who are in ‘Red’ are our target,” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X