వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం 57 శాతం పూర్తి...త్వరలోనే ప్రాజెక్టులు పరిశీలిస్తా:సిఎం చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరంపై 69వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం పనులను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా పోలవరం పనుల పరిశీలిస్తున్నామన్నారు.

Recommended Video

బీజేపీ మోసాన్ని నిలదీయండి: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికి 56.90% శాతం పూర్తి చేసినట్లుగా ఆయన తెలిపారు. నరేగా నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా, వారంవారం లక్ష్యాలను నిర్దేశించుకుని పనులను పూర్తిచేయాలని సూచించారు. సీసీ రహదారులు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.

పోలవరం...56.90% శాతం పూర్తి

పోలవరం...56.90% శాతం పూర్తి

పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటివరకూ 56.90% శాతం పూర్తయినట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. ఏఏ పనులు ఏఏ మేరకు అయ్యాయో ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా శాతాలలో వివరించారు. తవ్వకం పనులు 76.60%, కాంక్రీట్ పనులు 31.60%, కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 62.41%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.67%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93% పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు.

 ప్రాజెక్టుల పరిశీలనకు...త్వరలో

ప్రాజెక్టుల పరిశీలనకు...త్వరలో

ఈ సందర్భంగా ఇతర ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయమై సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టుల పరిశీలనకు త్వరలో వస్తా...పనుల్లో జాప్యాన్ని సహించని హెచ్చరించారు. అలాగే ఆగస్టు కల్లా అడవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేసి, ప్రారంభించాలని సిఎం ఆదేశించారు. సంగం-నెల్లూరు బ్యారేజ్‌లను నిర్దేశిత సమయానికి నిర్మించాలని, తారకరామ తీర్థ సాగర్ వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం కావాలన్నారు. వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి-పెన్నా అనుసంధానం తొలిదశ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు.

పనుల పూర్తి...సిఎం దిశానిర్ధేశం

పనుల పూర్తి...సిఎం దిశానిర్ధేశం

పంచాయతీల్లోని పాఠశాలల అభివృద్దికి సంబంధించి సిఎం చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒక పంచాయతీ పరిధిలోని అన్ని పాఠశాలల్లోనూ అభివృద్ధి పనులకు చంద్రబాబు అనుమతించారు. అలాగే శాఖలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగంగా చేపట్టాలి. అన్ని పాఠశాలల్లోనూ అభివృద్ధి పనులకు అనుమతి. నరేగా నిధులు వినియోగిస్తున్న 22 శాఖలు, స్పష్టమైన ప్రణాళికలు వచ్చేవారం నాటికి రూపొందించాలన్నారు.

రైతుల విషయమై...సిఎం సూచనలు

రైతుల విషయమై...సిఎం సూచనలు

ఈ ఏడాది రైతు రథం కింద 12 వేల ట్రాక్టర్లు రైతులకు అందించాలన్నారు. అలాగే రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్లను పంపిణీ చేయాలి. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. సమీప జలవనరుల ద్వారా పంటకుంటలు నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రెయిన్ గన్లను వినియోగించి పంటలను కాపాడాలని అధికారులకు సిఎం చంద్రబాబు సూచించారు.

English summary
Amaravathi:CM Chandra Babu said that Polavaram project work has already completed 56.90%. CM Chandrababu on Monday reviewed the progress made by NREGA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X