వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ ఉద్యోగుల పంపకాల వివాదం .. ముగిసిన కమిటీ విచారణ .. వారంలోగా నివేదిక

|
Google Oneindia TeluguNews

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ ఉద్యోగుల పంపకాల వివాదం మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ సంస్థల ఉద్యోగుల పంపకాల వివాదంపై గత రెండు రోజులుగా విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ వారం రోజుల్లో తమ నివేదికను సుప్రీంకోర్టుకు, రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వనుంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలినాడే రచ్చ ... విద్యుత్ ఒప్పందాలపై మాటల యుద్ధంఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలినాడే రచ్చ ... విద్యుత్ ఒప్పందాలపై మాటల యుద్ధం

రెండు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై విచారణ

రెండు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై విచారణ

రెండు రోజుల పాటు హైదరాబాద్లో రెండు రాష్ట్రాల్లోని విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో జస్టిస్ ధర్మాధికారి కమిటీ విచారణ జరిపింది. ఏపీ దక్షిణ డిస్కం సీఎండీ హరినాథ్, జె యం డి చక్రధర బాబు, తెలంగాణ జెన్కో సంచాలకుడు అశోక్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు సైతం ఈ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగుల పంపకాల విషయంలో ఎవరి వాదనలు వారు వినిపించారు.

ఏపీ స్థానికత కలిగిన వారిని రిలీవ్ చేసిన తెలంగాణా .. విధుల్లో చేర్చుకోని ఏపీ

ఏపీ స్థానికత కలిగిన వారిని రిలీవ్ చేసిన తెలంగాణా .. విధుల్లో చేర్చుకోని ఏపీ

తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత ఏపీ స్థానికత కలిగిన 1157 మందిని 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థ నుండి రిలీవ్ చేసి ఏపీకి పంపించారు. అయితే వారిని ఏపీ లో చేర్చుకోవడానికి అక్కడి అధికారులు నిరాకరించారు. దీంతో ఈ వివాదాన్ని తేల్చడానికి ధర్మాధికారి తో ఏకసభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించింది.

 కమిటీ ముందు తెలంగాణా విద్యుత్ సంస్థల ప్రతిపాదనలు

కమిటీ ముందు తెలంగాణా విద్యుత్ సంస్థల ప్రతిపాదనలు

ఈ 1157లో 613 మంది ఏపీలోనే చేరతామని ఆప్షన్‌ ఇచ్చినందున వారిని అక్కడ చేర్చుకుంటే మిగిలిన వారిని తెలంగాణలో తిరిగి చేర్చుకోవడానికి అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆదివారం రాతపూర్వకంగా తెలిపాయి. ఈ 1157 మంది కాకుండా ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 256 మంది తెలంగాణకు వెళతామని ఆప్షన్‌ ఇచ్చినందున వారిలో సగం మందిని కూడా తీసుకుంటామని తెలంగాణా విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి.

తిరస్కరించిన ఏపీ .. ముగిసిన విచారణ

తిరస్కరించిన ఏపీ .. ముగిసిన విచారణ

కానీ 613 మందిని ఏపీలో చేర్చుకుంటేనే తాము మిగతా వారిని తీసుకుంటామని తెలంగాణ విద్యుత్ సంస్థలు షరతు పెట్టాయి. ఇక తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలన్నింటినీ ఏపీ తిరస్కరించింది. దీంతో ఇక ఈ అంశంపై విచారణ ముగిసిందని, తుది నివేదికను సుప్రీంకోర్టుకు ఇస్తామని జస్టిస్‌ ధర్మాధికారి ప్రకటించారు. ఆయన ఇచ్చే తుది నివేదికలోని సిఫార్సులే సుప్రీంకోర్టు ఆదేశాలుగా త్వరలో వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

వారంలో తుది నివేదిక .. సర్వత్రా ఉత్కంఠ

వారంలో తుది నివేదిక .. సర్వత్రా ఉత్కంఠ


ఇప్పటివరకు రెండు రాష్ట్రాల ఉద్యోగుల పంపకాల విషయంలో జాప్యం జరగడం వల్ల విద్యుత్ ఉద్యోగులకు నష్టం జరిగిందని ఉద్యోగులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది .ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగా తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు పదోన్నతులు ఆగిపోయాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం జస్టిస్‌ ధర్మాధికారికిచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. త్వరితగతిన ఈ వివాదాన్ని తేల్చాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని వారు ధర్మాధికారి కమిటీకి విన్నవించారు. మరి త్వరలో ఒక తుది నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో కమిటీ నివేదిక ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Telangana and Andhra Pradesh have been divided for years and the dispute over the dispatch of electricity employees continues today. The Justice dharmadhikari Committee, which has been investigating the dispute over the dispatch of power companies employees between the Telugu states, will submit its report to the Supreme Court and the two Telugu states within a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X