వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి-ఏపీకి మధ్య పెరిగిన గ్యాప్: ఆ ప్రశ్నలకు సమాధానం లేదు..

ఈ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన స్థానికులు తమకు భూమికి బదులు భూమి, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య ఆర్థిక, జల వనరులకు సంబంధించిన లెక్కల విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో పైడిపాక, చేగొండపల్లి, దేవరగొండి, మామిడిగొండి, తోటగొండి ప్రాంతాల్లో అటవీ చట్టాలు(ఎఫ్ఆర్ఏ) ఉల్లంఘనకు గురువుతుండటం గురించి కేంద్రానికి ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన స్థానికులు తమకు భూమికి బదులు భూమి, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానమే లేకుండా పోయింది.

Communication gap widens between AP government and Centre

2011లెక్కల ప్రకారం ఏపీలోని 2.982గ్రామాల పరిధిలో 24.56లక్షల అటవీ భూమి ఉంది. ఇది కాక మరో 91.55లక్షల ఎకరాల భూమి ఆయా గ్రామాల సరిహద్దుకు అవతల ఉంది. హక్కులు-వనరులు(2015), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(1999) నిబంధనల ప్రకారం గ్రామాల పరిధిలో ఉన్న భూములు గ్రామ సభ పరిధిలోకే వస్తాయి. వీటిని కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్సెస్(సీఎఫ్ఆర్ఎస్), వ్యక్తిగత అటవీ ఆక్రమణ భూములుగా పరిగణిస్తారు.

దీనిపై స్పందించిన అటవీ అధికారి ఒకరు.. సర్వే చేయకుండా భూముల పరిధిని నిర్ణయించడం, అవి అటవీ భూములా? గ్రామాల పరిధిలోకి వస్తాయా? అన్నది గుర్తించడం సాధ్యం కాదని అన్నారు. ఒక అంచనా ప్రకారం.. 20శాతం అటవీ భూములు అంటే 18.31లక్షల ఎకరాలు గ్రామాల పరిధిలోకి వస్తున్నట్లు ఎఫ్ఆర్ఏ వెల్లడించింది.

గ్రామాల పరిధిలో ఉన్న మొత్తం అటవీ భూమి 42.87లక్షల ఎకరాలు ఉండవచ్చునని చెబుతున్నారు. వ్యక్తిగత అటవీ హక్కుల(ఐఎఫ్ఆర్) చట్టాలు కూడా భూములకు వర్తిస్తుండటంతో.. ఏపీ ప్రభుత్వం వీటి నుంచి 1.98ఎకరాలను మినహాయించింది. ఇక కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్సెస్ ను 40.89లక్షల ఎకరాలుగా లెక్క తేల్చింది. 4,695 వన సంరక్షణ సమితిలు, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ కమిటీలు దీన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది.

English summary
The communication gap between the Union and the State Governments on the issues of finance and water resources seems to be widening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X