వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్యం: చంద్రబాబుతో పొత్తు ఖరారు -కమ్యూనిస్టులు నాస్తికులు కాదు -సీపీఐ నారాయణ కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కమ్యూనిస్టులు.. మళ్లీ సైకిల్‌పై సవారీకి సిద్ధమయ్యారు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి దెబ్బయిపోయిన టీడీపీకి ఇప్పుడు సీపీఐ స్నేహహస్తం అందించింది. టీడీపీతో పొత్తు విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో స్వరూపానందతో భేటీపైనా ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులుజగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

 శాశ్వత శత్రువులు ఉండరు..

శాశ్వత శత్రువులు ఉండరు..

చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదమని గతంలో తిట్టిపోసిన సీపీఐ నారాయణ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో స్నేహపూర్వక పొత్తుతో వెళ్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల పరిధిలో సీపీఐ, టీడీపీలు ఉప్పటికే సీట్ల షేరింగ్, ఉమ్మడి ప్రచారంతో ముందుకు వెళుతుండగా, పొత్తు విషయాన్ని ఒక రాష్ట్ర(జాతీయ) స్థాయి నేత ఖరారు చేయడం ఇదే తొలిసారి. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుతో కుదిరిన పొత్తును భవిష్యత్తులోనూ కొనసాగించే అవకాశముందన్నారు నారాయణ. ప్లేటు ఫిరాయించినప్పుడల్లా చెప్పే డైలాగ్ ''రాజకీయాల్లో శాశ్వత శత్రువులు...శాశ్వత మిత్రులు ఉండురు''అని కూడా చెప్పారు.

అరాచకాల జగన్‌కు అంత భయమా?

అరాచకాల జగన్‌కు అంత భయమా?

గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని 8వ వార్డు అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా టీడీపీ నేతలతో కలిసి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో ఎన్నికల్లో అధికార వైసీపీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, ఈ స్థాయిలో నిర్బంధ ఏకగ్రీవాలు గతంలో ఏనాడూ చూడలేదని, అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా సాగుతోందని నారాయణ వాపోయారు. సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలకు ఓట్లు రావని జగన్ భయపడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారని, ఢిల్లీలో కేంద్ర పెద్దల పాదపూజలు చేసే విజయసాయిరెడ్డి.. విశాఖకు వచ్చి పాదయాత్రలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ నేత వ్యాఖ్యానించారు.

Recommended Video

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పై CPI జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు!
కమ్యూనిస్టులు నాస్తికులు కాదు..

కమ్యూనిస్టులు నాస్తికులు కాదు..

శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామిని సీపీఐ నారాయణ కలవడం, కాషాయ కండువా కప్పుకుని, దండాలు పెట్టడంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై నారాయణ తనదైన వివరణ ఇచ్చుకున్నారు. కమ్యూనిస్టులు నాస్తికులు కాదని, దేవుడనే భావనకు వ్యతిరేకం కాదని, కేవలం మెటీరియలిస్టులం మాత్రమే అని నారాయణ స్పష్టం చేశారు. బుధవారం విశాఖలోని శారదా పీఠాన్ని అనుకోకుండా సందర్శించానని, జీవీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి తరఫున 97వ వార్డులో ఆయన పర్యటిస్తుండగా శారదా పీఠాన్ని చూసి లోపలకు వెళ్లానని, సీపీఐ అభ్యర్థిని గెలుపొందేలా ఆశీర్వదించాలని కోరానని చెప్పుకొచ్చారు.ఒకరి అభిప్రాయాన్ని మరొకరితో పంచుకున్నామని తెలిపారు.

viral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లుviral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లు

English summary
cpi national secretary narayana said that Communists are not atheists, they do not deny concept of God. taking part in municipal election campaign at guntur on thursday, cpi leader confirmed that they had Friendly alliance with chandrababu TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X