వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీడీ ఈవో పోస్ట్‌: ఐఏఎస్‌ల పోటాపోటీ, తెరపైకి సౌత్, నార్త్ ఇండియా వాదన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు రెండుగా చీలిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవి కోసం ఉత్తర, దక్షిణ ఐఏఎస్ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నార్త్ ఇండియా ఐఏఎస్ అధికారికి టీటీడీ ఈఓ పదవి ఇ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు రెండుగా చీలిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవి కోసం ఉత్తర, దక్షిణ ఐఏఎస్ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నార్త్ ఇండియా ఐఏఎస్ అధికారికి టీటీడీ ఈఓ పదవి ఇవ్వవద్దని ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేయడం గమనార్హం.

కాగా, టీటీడీ ఈఓ పదవికి తన పేరును పరిశీలించాలని ఇప్పటికే జవహర్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సింఘాల్ కూడా ఈ పోస్ట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొందరు అధికారులు సింఘాల్‌కు మద్దతు తెలుపుతున్నారు.

Competition for TTD EO post

అయితే, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్ వీ ప్రసాద్ పేరు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఏ ఐఏఎస్ అధికారికి టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించినా ఫర్వాలేదని కానీ.. నార్త్ ఇండియన్ ఐఏఎస్ అధికారిక మాత్రం ఇవ్వవద్దని ఏపీ ఐఏఎస్‌లు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబునాయుడు టీటీడీ ఈవో నియామకంపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో టీటీడీ ఈఓ పదవి నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నార్త్, సౌత్ ఇండియా వాదన తెరపైకి రావడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
It is said that heavy Competition for TTD EO post between North and South Indian IAS officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X