చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటి భానుప్రియ ఇంట్లో తెలుగు బాలిక నిర్బంధం: ఇక ఏ క్షణమైనా: ముందస్తు బెయిల్ కోసం!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ నటి భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. మన రాష్ట్రానికి చెందిన బాలికను నిర్బంధించి, వేధింపులకు గురి చేసిన కేసులో ఇక చెన్నై పోలీసులు రంగ ప్రవేశం చేయబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసు.. తాజాగా చెన్నైకి బదిలీ అయింది. నేడో, రేపో పాండీ బజర్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేయనున్నారు. ఈ కేసు ఏరకంగా ముందుకెళ్లినప్పటికీ.. భానుప్రియ అరెస్టు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే భానుప్రియ, ఆమె సోదరుడు అప్రమత్తం అయ్యారని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. బాలికను నిర్బంధించడం, వేధింపులకు గురి చేయడం బాలల హక్కుల పరిరక్షణ చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం కిందికి రానున్న నేపథ్యంలో.. ముందస్తు బెయిల్ దొరకడం కష్టమని తెలుస్తోంది.

భానుప్రియ ఇంట్లో సామర్లకోట బాలిక నిర్బంధం..

భానుప్రియ ఇంట్లో సామర్లకోట బాలిక నిర్బంధం..

అలనాటి అందాల నటి భానుప్రియ చెన్నైలోని పాండీ బజార్ లో నివసిస్తున్నారు. ఇంటి అవసరాల కోసం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ఓ బాలికను పనిలోకి తీసుకున్నారు. ఆ బాలిక వయస్సు 14 సంవత్సరాలు. చాలాకాలం నుంచీ తమ కుమార్తె ఇంటికి రావట్లేదని, ఆమెతో మాట్లాడటానికి కూడా కుదరట్లేదని అంటూ ఆ బాలిక తల్లిదండ్రులు జనవరిలో సామర్లకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రభావతి అనే మహిళ ఏడాది కిందట తన కూతురు సంధ్యని చెన్నైలో భానుప్రియ నివాసంలో పనికి పెట్టిందని, అప్పటి నుంచీ తమ కుమార్తెను స్వగ్రామానికి పంపించట్లేదని, కనీసం ఫోన్‌ లో కూడా మాట్లాడనివ్వట్లేదని వారు తమ ఫిర్యాదులో పొందుపరిచారు. తమ కుమార్తెను పనిలో కుదిర్చిన ప్రభావతి పేరును సైతం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో ఉటంకించారు.

బాలికపై చోరీ కేసు పెట్టిన భానుప్రియ

బాలికపై చోరీ కేసు పెట్టిన భానుప్రియ

అదే నెలలో భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ కూడా సామర్లకోట బాలికపై పాండీ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తమ ఇంట్లో పని అమ్మాయి చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బాలికపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను బాలిక తల్లి తోసిపుచ్చారు. తమ కుమార్తెను వారు ఇంట్లో నిర్బంధించి హింసిస్తున్నారని వారు సామర్లకోట పోలీసులను ఆశ్రయించారు. బాలకార్మిక నిరోధక చట్టం కింద భానుప్రియపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా వారు ఇప్పటికే పలుమార్లు చెన్నై వెళ్లి భానుప్రియను విచారించారు. ప్రతీసారి చెన్నై వెళ్లాల్సి రావడం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఫలితంగా- ఈ కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతోందంటూ బాలిక తల్లిదండ్రుల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కడంతో పాటు కేసు దర్యాప్తులో వేగం పెంచడానికి సామర్లకోట పోలీసులు ఈ కేసును చెన్నైకి బదిలీ చేశారు.

చెన్నై పోలీసుల చేతికి..

చెన్నై పోలీసుల చేతికి..

దీనికోసం తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హష్మీ.. చెన్నై డీసీపీతో ఫోనులో సంప్రదించారు. అనంతరం- దీన్ని పాండీ బజార్ పోలీసులకు అప్పగించారు. శనివారం సామర్లకోట పోలీసులు చెన్నై వెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇప్పటిదాకా కొనసాగించిన దర్యాప్తు వివరాలు, ఇదివరకు నమోదు చేసిన భానుప్రియ వాంగ్మూలాన్ని పాండీ బజార్ పోలీసులకు అందజేశారు. రాష్ట్రం మారిన నేపథ్యంలో.. మరోసారి భానుప్రియపై కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ సారి సామర్లకోట పోలీసుల పేరుతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసు విచారణ వేగవంతం చేయనున్నట్లు పాండీ బజార్ పోలీసులు తెలిపారు. భానుప్రియ, ఆమె సోదరుడిపై మరోమారు బాలకార్మిక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఏ క్షణమైనా అరెస్ట్.. ముందస్తు బెయిల్ కూడా రాని కేసు..

ఏ క్షణమైనా అరెస్ట్.. ముందస్తు బెయిల్ కూడా రాని కేసు..


పనమ్మాయి తమ ఇంట్లో చోరీ చేసిందని భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణన్ కూడా ఎదురు కేసు పెట్టిన కేసులో బాలిక నిరపరాధిగా తేలింది. తమ ఇంట్లో 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను బాలిక చోరీ చేసిందంటూ ఫిర్యాదు చేయగా.. పాండీ బజార్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి, జువైనల్ హోమ్ తరలించారు. అనంతరం వారు చేపట్టిన దర్యాప్తులో ఆ బాలిక నిరపరాధిగా తేలింది. జువెనైల్ జస్టిస్ బోర్డు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తప్పుడు కేసు నమోదు చేయడం, బాలికను నిర్బంధించిన కేసుల్లో భానుప్రియ, ఆమె సోదరుడు గోపాల కృష్ణన్ ను పోలీసులు ఇక ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. బాల కార్మికుల నిరోధక చట్టం కింద కేసు నమోదు కావడం వల్ల ముందస్తు బెయిల్ కూడా దొరిక్క పోవచ్చని అంటున్నారు.

English summary
The city police have registered a complaint against actress Bhanupriya for practicing child labour and allegedly harassing a minor who was the family’s domestic help. According to police, the case was registered based on a complaint by the minor girl and her mother with Andhra Pradesh police. Since the incident took place at Pondy Bazzar area, the Andhra police have forwarded the complaint to Chennai police to carry out further investigations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X