వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ అక్రమార్జనపై ఫిర్యాదు: ప్రభుత్వ కాల్ సెంటర్ కు ఫోన్: 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలంటూ..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి ప్రారంభించి..ప్రభుత్వమే నిర్వహిస్తున్న కాల్ సెంటర్ కు ఏకంగా సీఎం పైనే ఫిర్యాదు వచ్చింది. ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. దీనిని మఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇందు కోసం కాల్ సెంటర్ కు టోల్ ఫ్రీ పెంబర్ గా 14400 ను కేటాయించారు. ఈ కాల్ సెంటర్ ప్రారంభించిన మరుసటి రోజునే ఒక ఫిర్యాదు వచ్చంది. అందులో ముఖ్యమంత్రి జగన్ అక్రమార్జనపైన అధ్యయనం చేయాలంటూ ఫిర్యాదు చేసారు. అయితే, ఈ ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎరవైనా అధికారులకు ఇవ్వాలని అక్కడి కాల్ సెంటర్ సిబ్బంది సూచించారు. ఇంతకీ..ముఖ్యమంత్రి పైన కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసి అక్రమార్జన పైన ఫిర్యాదు చేసిందెవరో తెలుసా..ఆ తరువాత ఏం జరిగింది.

కాల్ సెంటర్ కు సీఎం పై ఫిర్యాదు
ప్రభుత్వం నిర్వహిస్తున్న కాల్ సెంటర్ కు ముఖ్యమంత్రి పైన ఫిర్యాదు వచ్చింది. అది ఎవరని ఆరా తీయగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గా తేలింది. ప్రభుత్వం తాజాగా అవినీతి పై ఫిర్యాదుల కోం కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది.

Complaint on Cm to Govt call centre on his illegal assests

14400 నెంబర్ కు వర్ల రామయ్య కాల్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ అక్రమార్జన పైన అధ్యయనం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైయస్ హాయంలో తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని జగన్ వేల కోట్లు సంపాదించారని పిర్యాదు చేసారు. జగన్ అవినీతి పైనా ఐఐఎం అహ్మదాబాద్ అధ్యయనం చేయాలని కోరారు. తనపైన 43 వేల కోట్ల రూపాయాల అభియోగాలు ఉండగా ..అవినీతి అంతం చేస్తానని జగన్ ఎలా చెబుతారంటూ వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు.

కాల్ సెంటర్ సిబ్బంది ఏం చేసారు..
ఇలా...కాల్ సెంటర్ కు ఏకంగా ముఖ్యమంత్రి అవినీతి గురించి ఫిర్యాదు రావటంతో సిబ్బంది అక్కడ ఉన్న అధికారులను సంప్రదించారు. వారు వెంటనే వర్ల రామయ్యకు సమాధానం ఇచ్చారు. ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది సూచించారు. తన పై తానే అధ్యయనం చేయించుకుంటానని సీఎం స్వచ్ఛందంగా ముందుకు రావాలి అన వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అయితే, ఇదంతా తాము అవినీతికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తుంటే..ఇటువంటి పనుల ద్వారా టీడీపీ నేతలు అంశాన్ని పక్క దారి పట్టిస్తున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏసీబీ దాడులకు రంగం సిద్దం అవుతున్నట్లు సమాచారం.

English summary
Govt maintainiing call center for corruption complaints recieved a complaint on CM Jagan illegal assests by TDP leader Varla Ramaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X