విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో 26 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉత్తర్వులు వెనక్కి: గందరగోళం: తాత్కాలికమేనంటోన్న

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలో శుక్రవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయబోతున్నట్లు జారీ చేసిన ప్రకటనలను క‌ృష్ణాజిల్లా అధికార యంత్రాంగం వెనక్కి తీసుకుంది. ముందుగా ఆదేశించినట్లుగా శుక్రవారం నుంచి విజయవాడలోం లాక్‌డౌన్‌ను అమలు చేయబోవట్లేదని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో రోజురోజుకూ భారీగా పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ను విధించబోతున్నట్లు తొలుత కలెక్టర్ ఓ ప్రకటన, వీడియోను జారీ చేశారు. కొద్దిసేపటి అనంతరం దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.

Recommended Video

#Lockdown : Vijayawada లో Lockdown లేదు.. ఉత్తర్వులు ఉపసంహరణ! || Oneindia Telugu

10న నిమ్మగడ్డపై సుప్రీంకోర్టు తీర్పు.. 13న సుజనాను కలిశా: ఛాలెంజ్ చేస్తున్నా: కామినేని10న నిమ్మగడ్డపై సుప్రీంకోర్టు తీర్పు.. 13న సుజనాను కలిశా: ఛాలెంజ్ చేస్తున్నా: కామినేని

ఎప్పటి నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తామనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. శుక్రవారం నుంచి అమలు చేయదలిచిన ంపూర్ణ లాక్‌డౌన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ వందల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదువుతోన్న నేపథ్యంలో.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి ఉంది. అనంతపురం, ప్రకాశం జిల్లాలోని కొన్ని పట్టణాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ లాక్‌డౌన్ అమల్లోకి తీసుకొస్తామని ఇదివరకే జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలను జారీ చేసింది.

Complete lockdown in Vijayawada from June 26 orers was cancelled: Krishna district Collector

విజయవాడలో లాక్‌డౌన్‌ను అమలు చేయడంపై జిల్లా పాలనాధికారులు ఎందుకు వెనక్కి తగ్గారనేది తెలియరావాల్సి ఉంది. దీనిపై మరి కాస్సేపట్లో కలెక్టర్ ఇంతియాజ్ మరో తాజా ప్రకటన జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ అమలు చేయడాన్ని పూర్తిగా రద్దు చేయలేదని, తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెబుతున్నారు. సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌ను విధించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. విజయవాడలో లాక్‌డౌన్ అమలుపై అధికారులు ప్రకటన జారీ చేయడం, మళ్లీ ఉపసంహరించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
Complete lockdown in Vijayawada from June 26 orers was cancelled. Krishna district Collector Md Imtiaz repealed the orders which was issued by the District administration. Collector told that they will inform regarding the lock down impose in Vijayawada soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X