కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారాస్థాయికి నంద్యాల గ్రూప్ పాలిటిక్స్...29న తేల్చేస్తా:ఎవి సుబ్బారెడ్డి

|
Google Oneindia TeluguNews

కర్నూలు:నంద్యాల టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా భూమా నాగిరెడ్డి వర్థంతి రోజు చేసుకున్న పరిణామాలు ఆళ్లడగ్గ రాజకీయాలను మరింత వేడెక్కించాయి.

మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు భూమా వర్థంతి నాడే ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. అఖిల ప్రియ తన తండ్రి వర్ధంతి సభకు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఎవి సుబ్బారెడ్డిని పిలవకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నట్లు ఎవి సుబ్బారెడ్డి తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.

భూమా నాగిరెడ్డి...ఏవి సుబ్బారెడ్డి...సన్నిహితులు

భూమా నాగిరెడ్డి...ఏవి సుబ్బారెడ్డి...సన్నిహితులు


భూమా నాగిరెడ్డి...ఏవీ సుబ్బారెడ్డి ఎంత సన్నిహితంగా మెలిగేవారో అక్కడ అందరికీ తెలుసు. ఏ వ్యవహారమైనా ఇద్దరూ కలసి చర్చించుకోనిదే చేయరని చెప్పుకునేవారు. అయితే, భూమా మరణం తర్వాత ఒక్కసారిగా ఆ కుటుంబంతో ఏవీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందుకు కారణం ఒక కాంట్రాక్ట్ వ్యవహారమని తెలుస్తోంది. ఈ కాంట్రాక్ట్ వ్యవహారంలో ఒకరే లబ్ది పొందేలా ప్రయత్నిస్తున్నట్లు ఇరువురూ భావించేలా పరిస్థితులు రావడంతో ఇక వీరి మధ్య విభేదాలు మొదలై అంతకంతకూ అంతరం పెరిగిపోయింది. ఈ విషయమై ఒకరిమీద ఒకరు ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

సిఎం జోక్యం చేసుకున్నా..నో యూజ్

సిఎం జోక్యం చేసుకున్నా..నో యూజ్

ఆ తరువాత కాలంలో వీరి మధ్య మాటలు కూడా లేకపోవడంతో పాటు పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతవరకు వెళ్లింది. అయితే నంద్యాల ఉప ఎన్నిక సమయంలో వీరిమధ్య విభేదాలు ప్రత్యర్థులకు లాభం చేకూరుస్తాయని గ్రహించిన సిఎం చంద్రబాబు...ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లాలని మంత్రి అఖిల ప్రియను ఆదేశించారు. దీంతో ఆమె అయిష్టంగానే ఏదో మొక్కుబడిగా మాట్లాడి ఆ సమయం కానిచ్చేశారు. ఆ తరువాత మళ్లీ వీరి మధ్య పాత వైరమే కొనసాగుతున్నట్లు కొన్ని రోజుల క్రితం నంద్యాలలో నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంతో తేటతెల్లమైపోయింది. ఎవి సుబ్బారెడ్డి హాజరైన ఈ మీటింగ్ కు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ నాయకత్వం వహించినప్పటికీ మంత్రి అఖిల ప్రియ హాజరుకాలేదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసినా పరిస్థితిలో ఏ మార్పు లేదు.

 భూమా నాగిరెడ్డి వర్థంతితో...తాజాగా...బయల్పడ్డ విభేదాలు...

భూమా నాగిరెడ్డి వర్థంతితో...తాజాగా...బయల్పడ్డ విభేదాలు...

భూమా బ్రతికిఉన్న కాలంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన తనను ఆయన కుమార్తె మంత్రి అఖిల ప్రియ పదే పదే అవమానిస్తున్నట్లు ఎవి సుబ్బారెడ్డి భావిస్తున్నారు. భూమా వర్థంతి కార్యక్రమానికి తనను పిలవకపోవడంతో పాటు ఆ రోజు సభలో "గుంట నక్కలు" అంటూ మంత్రి అఖిల ప్రియ మాట్లాడిన మాటలకు ఆయనను తీవ్రంగా హర్టయినట్లు తెలుస్తోంది. దీంతో ఇక ఉపేక్షించి లాభం లేదని నిర్ణయించుకున్న ఎవి సుబ్బారెడ్డి...మంతత్రి అఖిల ప్రియపై తీరుపై బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి వర్థంతి రోజు అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏవీ సుబ్బారెడ్డి...ఆమెతో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

 తీవ్ర నిర్ణయం...ఈ నెల 29 న తేల్చేస్తా...

తీవ్ర నిర్ణయం...ఈ నెల 29 న తేల్చేస్తా...

ఆళ్లగడ్డలో గుంట నక్కలు ఎవరో త్వరలో తేలుస్తానని వ్యాఖ్యానించిన ఎవి సుబ్బారెడ్డి ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు. సిఎం చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబంధాలున్నాయని...తనకు ఏ పదవి ఇవ్వాలో త్వరలో ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని ఎవి సుబ్బారెడ్డి అన్నారు.దీంతో ఎవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆళ్లగడ్డ రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే అఖిల ప్రియ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సిఎం చంద్రబాబు...ఎవి సుబ్బారెడ్డి వైపే మొగ్గుచూపిస్తారా అనే చర్చ జరుగుతోంది. అలా జరిగితే మంత్రి అఖిల ప్రియ ఏం చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయంగా ఈ నెల 29 న సంచలనం చెలరేగే అవకాశం ఉందంటున్నారు స్థానిక రాజకీయ నేతలు.

English summary
With the latest comments made by AV Subbareddy about his political future raise political heat in Allagadda constituency. Leader AV Subbareddy was frustrated with the attitude of minister Akhilapriya...announced that he would announce about his political future on the 29th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X