వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌స‌భ‌లో కాంగ్రెస్‌..వైసీపీ స‌భ్య‌ల మ‌ధ్య వాగ్వాదం: జ‌మ్ము కాశ్మీర్ బిల్లులో ఏపీ వైపు ట‌ర్న్‌..!

|
Google Oneindia TeluguNews

లోక్‌స‌భ‌లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. జ‌మ్ము కాశ్మీర్ వ్య‌వ‌హార మీద అధికార‌-ప్ర‌తిప‌క్షం మ‌ధ్య సాగుతు న్న మాట‌ల యుద్దం స‌డ‌న్‌గా కాంగ్రెస్ - వైసీపీ గా మారింది. కాశ్మీర్‌ను విభ‌జించాలంటే ముందుగా ఆ రాష్ట్ర అసెంబ్లీ అనుమ‌తి తీసుకోవాల‌ని కాంగ్రెస్ స‌భ్యుడు మ‌నీష్ తివారీ పేర్కొన్నారు. దీనికి స‌భలో ఉన్న వైసీపీ ఎంపీలు మొత్తంగా ఆందోళ‌న‌కు దిగారు. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో ఈ నియ‌మం ఏమైంద‌ని నిల‌దీసారు. తాము అసెంబ్లీని సంప్ర‌దించా మ‌ని మ‌నీష్ తివారీ చెప్పుకొచ్చారు. దీనికి వైసీపీ స‌భ్యులు ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌ను వివ‌రించారు. బీజేపీ కి వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోందంటూ కాంగ్రెస్ స‌భ్యులు నినాదాలు చేసారు.

కాశ్మీర్ అంశంపై చ‌ర్చ‌లో ఏపీ వ్య‌వ‌హారం..

కాశ్మీర్ అంశంపై చ‌ర్చ‌లో ఏపీ వ్య‌వ‌హారం..

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జ‌రుగుతున్న స‌మ‌యం లో ఏపీ వ్య‌వ‌హారం పైన చ‌ర్చ జ‌రిగింది. బిల్లుపై మాట్లాడిన కాంగ్రెస్‌ సభ్యుడు మనీష్‌ తివారి.. కశ్మీర్‌ విభజించిన తీరు సరిగా లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనపై ఆ రాష్ట్ర అసెంబ్లీని సంప్ర‌దించిన ట్లు ఆయన గుర్తుచేశారు. అలాగే కశ్మీర్‌ను విడగొట్టాలి అనుకున్నప్పుడు రాష్ట్ర శాసనసభ అనుమతి ఎందుకు తీసుకో లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్ర‌స్ స‌భ్యుడి వ్యాఖ్య‌ల పైన వైసీపీ స‌భ్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. త‌మ సీట్ల లో లేచి నిల‌బ‌డి నిర‌స‌న తెలిపారు. వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిం ది. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ ఇప్పుడు కశ్మీర్‌పై మాట్లాడం సరికాదని హితవుపలికింది. ఆ త‌రువాత జ‌రిగిన చ‌ర్చ‌లో వైసీపీ నుండి మాట్లాడిన న‌ర్సాపురం లోక్‌స‌భ స‌భ్యుడు ర‌ఘురామ రాజు బిల్లుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించా రు. అదే సమ‌యంలో ఏపీలో జ‌రిగిన విష‌యాల‌ను గుర్తు చేసారు.

ఏపీ అసెంబ్లీ బిల్లును తిర‌స్క‌రించింది...

ఏపీ అసెంబ్లీ బిల్లును తిర‌స్క‌రించింది...

ఏపీ విభ‌జ‌న బిల్లును ఏపీ అసెంబ్లీకి పంపించిన మాట వాస్త‌వమేన‌ని వైసీపీ స‌భ్యుడు ర‌ఘురామ రాజు చెప్పుకొచ్చారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న బిల్లు అసెంబ్లీకి రాగా..మెజార్టీ స‌భ్యులు ఆందోళ‌న న‌డుమ విభ‌జన‌కు వ్య‌తిరేకంగా మాట్లాడార‌ని ర‌ఘు రామ‌రాజు గుర్తు చేసారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న కిర‌ణ్ కుమార్ రెడ్డి విభ‌జ‌న‌కు వ్య‌తి రేకంగా ప‌ద‌వికి ..పార్జీకి రాజీనామా చేసార‌ని చెప్పుకొచ్చారు. ఏపీ శాస‌న‌స‌భ విభ‌జ‌న బిల్లును తిర‌స్క‌రిస్తూ కేంద్రానికి పంపింద‌ని గుర్తు చేసారు. అటువంటి బిల్లును లోక్‌స‌భ‌లో నాటి యూపీఏ ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా త‌లుపులు మూసి స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసి రాష్ట్ర విభ‌జ‌న చేసింద‌ని వివ‌రించారు. అయితే, వైసీపీ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీలు వైసీపీ నేత‌లు బీజేపీకి మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యాలు చేసారు. తాము మ‌ద్ద‌తుగా మాట్లాడ‌టం కాద‌ని..వాస్త‌వాలు చెబుతున్నామంటూ వైసీపీ స‌భ్యులు స‌మాధానం ఇచ్చారు.

Recommended Video

వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్
విభ‌జ‌న బిల్లుకు వైసీపీ మ‌ద్ద‌తు..

విభ‌జ‌న బిల్లుకు వైసీపీ మ‌ద్ద‌తు..

రాజ్య‌స‌భ‌లో కేంద్ర ప్ర‌తిపాదించిన జ‌మ్ము కాశ్మీర్ విభ‌జ‌న బిల్లుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన వైసీపీ ..లోక్‌స‌భ‌లోనూ అదే వైఖ‌రిని స్ప‌ష్టం చేసింది. ఈ బిల్లు ద్వారా జ‌మ్ము కాశ్మీర్ ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌నే భావ‌న వైసీపీ వ్య‌క్తం చేసింది . ఒకే దేశం..ఒకే జెండా అనేదే త‌మ విధానం అని లోక్‌స‌భ‌లో స్ప‌ష్టం చేసింది. జ‌మ్ము కాశ్మీర్‌లో ఈ నిర్ణ‌యం ద్వారా ఇక అభివృద్దికి అడుగులు ప‌డ‌తాయ‌నే అశాభావం వ్య‌క్తం చేసారు. ఈ నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాని మోదీ..హోం మంత్రి అమిత్‌షాను వైసీపీ అభినందించింది.

English summary
Congress and YCP MP's dialogue war in Loksabha on Jammu Kashmir bill debate time. Congress mentioned about AP bifurcation issue. YCP supported Central Govt proposed bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X