వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా లేఖతోనే టి వచ్చింది, బాబు పర్యటిస్తారు: ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్/కరీంనగర్: తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చినందువల్లే తెలంగాణ రాష్ట్రం కల సాధ్యమైందని ఆ పార్టీ సీనియర్ నేత, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం కరీంనగర్ జిల్లాలో అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చొరవ వల్లనే కేంద్రం అఖిల పక్ష భేటీని నిర్వహించిందన్నారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి మ్యాచ్ ఫిక్సింగులో భాగంగానే రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.

టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ లేఖ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. త్వరలో చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. తమ పార్టీ సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేస్తామన్న బాబు తెలంగాణపై తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చి, ఇరు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాబుతో పాటు తాము ఢిల్లీకి వెళ్తామన్నారు.

జానాతో మందకృష్ణ భేటీ

పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం హైదరాబాదులో భేటీ అయ్యారు. విద్యార్థి యుద్ధ భేరీ సభకు మద్దతివ్వాలని జానాను కోరారు. అందుకు జానా సమ్మతించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయించేందుకు అవసరమైతే తాము ఢిల్లీ వెళ్తామని జానా ఈ సందర్భంగా చెప్పారు.

అనంతరం మందకృష్ణ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. విభజనపై జాప్యం దానిని అడ్డుకునే శక్తులకు ఊతమిస్తుందన్నారు. సిడబ్ల్యూసి చేసిన ప్రకటనలో ఒక్క అక్షరం వెనక్కి పోయినా ఊరుకునేది లేదన్నారు. యుద్ధ భేరీని తాము ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. గుంటూరులో నిర్వహించ తలపెట్టిన సభను అక్టోబర్ 6కు వాయిదా వేసుకుంటున్నట్లు చెప్పారు.

English summary

 Telugudesam Party senior leader Errabelli Dayakar Rao said that Congress was announced Telangana state after TDPs letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X