వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కడివెడు విషంలో చిటికెడు పాలు కలిపేందుకు వెళ్తే.. రోజా కన్నీటితో పన్నీటి జల్లు'

ఏపీలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరు కావాలనుకున్న తమ పార్టీ ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరు కావాలనుకున్న తమ పార్టీ ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సోమవారం నాడు భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. మహిళా పార్లమెంటు సదస్సును టిడిపి నేతలు కిట్టీ పార్టీలా మార్చారని ఎద్దేవా చేసారు. సదస్సులో డ్వాక్రా మహిళల గొంతు వినిపించలేదన్నారు.

<strong>'రోజా ఫోన్లో కెమెరా ఆన్ చేస్తుంటే.. కిడ్నాప్, చంద్రబాబుకు భయమెందుకు'</strong>'రోజా ఫోన్లో కెమెరా ఆన్ చేస్తుంటే.. కిడ్నాప్, చంద్రబాబుకు భయమెందుకు'

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజా కన్నీటితో పన్నీరు చల్లుకున్నారని చెప్పారు. వైసిపి సదస్కుకు హాజరై కడివెడు విషంలో చిటికెడు పాలు కలిపిందుకు ప్రయత్నించిందన్నారు.

Congress blames Chandrababu Government in Roja issue

రోజాను అడ్డుకోవడంపై కాంగ్రెస్

రోజాను పోలీసులు అడ్డుకోవడాన్ని ఏపీ కాంగ్రెస్ నేతలు మల్లాది విష్ణు, శివాజీలు తప్పుబట్టారు. సోమవారం ఉదయం విజయవాడలో వారు మాట్లాడారు. ప్రభుత్వ వైఖరి ముమ్మాటికీ మహిళలను అవమానించడమే అన్నారు.

విమానాశ్రయంలోనే అడ్డుకుని, కారులో ఆమెను హైదరాబాద్ తరలించడం ప్రజాస్వామాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. కేవలం టీడీపీకి అనుకూలంగా ఉన్న వారినే సదస్సుకు ఆహ్వానించారని, మహిళల సమస్యల పట్ల పోరాటం చేస్తున్న సోనియా గాంధీ, మేధా పాట్కర్, బృందా కారత్ లాంటి వారిని ఎందుకు ఆహ్వానించలేదన్నారు.

English summary
Congress Party on Monday blamed AP CM Chandrababu Naidu Government in YSR Congress Party Roja issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X