• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతిలో జగన్ అధర్మ యుద్ధం ; రిగ్గింగ్ కుట్ర , జైలుకెళ్ళటానికి సిద్ధంగా ఉండు : చింతామోహన్ ధ్వజం

|

తిరుపతి పార్లమెంటరీ స్థానానికి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది గంటల్లో తిరుపతిలో ధర్మయుద్ధం ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన చింతా మోహన్ వ్యాఖ్యానించారు. మరికొద్ది గంటల్లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తిరుపతి లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిపోశారు.

తిరుపతిలో పోలీసుల సహాయంతో రిగ్గింగ్ కు పాల్పడటానికి సిద్ధమయ్యారు

తిరుపతిలో పోలీసుల సహాయంతో రిగ్గింగ్ కు పాల్పడటానికి సిద్ధమయ్యారు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధానికి శ్రీకారం చుట్టారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని అభిప్రాయపడ్డారు . తిరుపతిలో పోలీసుల సహాయంతో రిగ్గింగ్ కు పాల్పడటానికి సిద్ధమయ్యారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సామాన్య కుటుంబంలో పుట్టారని కానీ వేల కోట్లకు వైయస్ జగన్ అధిపతి ఎలా అయ్యారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు చింతామోహన్.

జగన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అంటూ తీవ్ర వ్యాఖ్యలు

జగన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అంటూ తీవ్ర వ్యాఖ్యలు

జగన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . గతంలో లక్ష రూపాయల లంచం తీసుకున్నందుకు బంగారు లక్ష్మణ్ జైలుకు వెళ్లారని, మారుతి కారు కొన్న లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష పడిందని గుర్తు చేసిన ఆయన వేల కోట్లు అక్రమంగా సంపాదించిన జగన్ కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు . చింతామోహన్ వెంకటగిరి కి రాజధాని ముఖ్యపట్టణం అయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్న చంద్రబాబు నాయుడు తుళ్లూరుకి తీసుకు వెళ్లారని తాను తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిస్తే వెంకటగిరి ని రాజధాని చేస్తామని వెల్లడించారు.

బిజెపి, వైసిపి ,టిడిపిలకు ఓటు వేయవద్దని చింతామోహన్ ప్రజలకు విజ్ఞప్తి

బిజెపి, వైసిపి ,టిడిపిలకు ఓటు వేయవద్దని చింతామోహన్ ప్రజలకు విజ్ఞప్తి

అంతేకాదు ఏర్పేడు నుండి రాపూర్ వరకు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని కోట్లాది మంది ప్రజలకు అన్యాయం జరగకూడదు అనుకుంటే తిరుపతిలో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. బిజెపి, వైసిపి ,టిడిపిలకు ఓటు వేయవద్దని చింతామోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పై బీజేపీ పై విరుచుకు పడిన ఆయన ప్రధాని గడ్డం పెట్టుకున్నంత మాత్రాన దేవుడు కాలేరని విమర్శించారు. తిరుపతిలో బిజెపికి ఎందుకు ఓటు వేయాలో చెప్పారని నిలదీశారు.

 ఎన్నికల కమిషన్ బతికుందా లేక చచ్చిపోయిందా అంటూ ఫైర్

ఎన్నికల కమిషన్ బతికుందా లేక చచ్చిపోయిందా అంటూ ఫైర్

రిగ్గింగ్ కు పాల్పడటానికి బయటి వ్యక్తులు కూడా తిరుపతికి చేరుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని అరెస్టు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, కానీ పోలీసులు ఏం చేస్తున్నారో అంతుచిక్కడం లేదన్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బతికుందా లేక చచ్చిపోయిందా అంటూ చింతామోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో రిగ్గింగ్ జరిగితే తాను నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చింతా మోహన్ హెచ్చరించారు .

English summary
Chinta Mohan, a Congress candidate, said that the dharma war would begin in Tirupati in a few hours. He alleged They are ready to commit rigging with the help of police in Tirupati. Jagan need to tell how he earned thousands of crores and said that Jagan need to ready to go to jail. jagan has been criticized for waging an unjustice war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X