తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోదా: మోడీకి చిరంజీవి హెచ్చరిక, నిప్పంటించుకోవడంతో టెన్షన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీని కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తామని, పోరాటాలకు సిద్ధమవ్వాలని, చేయీచేయీ కలిపి రంగంలోకి దిగాలని, ప్రభుత్వం మెడలు వంచి దానిని సాధించాలే తప్ప అఘాయిత్యాలకు పాల్పడవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందు బిజెపి, టిడిపిలు ఇచ్చిన హామీలను, విభజన చట్టంలోని అంశాలన్నిటినీ తప్పక అమలు చేసి తీరాల్సిందే అన్నారు. తిరుపతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్వహించిన పోరుసభలో పలువురు నాయకులు ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఇది క్విట్ ఏపీ ఉద్యమం అన్నారు.

సభకు మాజీ మంత్రి శైలజానాథ్‌ అధ్యక్షత వహించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడుతూ.. ఆనాడు అందరి ఆమోదంతోనే రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం అందించడంతోబాటు ఏపీని ఆదుకునేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ప్రస్తుతం అధికారానికి రాగానే వీటన్నిటినీ ఎలా ఎగ్గొట్టాలా అని ప్రధాని మోడీ చూస్తున్నారన్నారు.

కేంద్రం మెడలు వంచుతామన్నారు. ఎన్నికలకు ముందు అధికారం కోసం ప్రత్యేక హోదా అన్న ప్రధాని ఇప్పుడు నోరు మెదపకుండా మౌనమునిలా వ్యవహరిస్తున్నాడని, మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. కాగా, సభలో ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణంలో సభ జరిగింది.

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కాగా, పోరుసభ జరుగుతున్న ప్రాంగణంలో ఆ పార్టీ కార్యకర్త, స్థానిక మంచాల వీధికి చెందిన బెంగళూరు ముని కామ కోటి (41) ఆత్మహత్యాయత్నం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిందాబాద్‌, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అరుస్తూ ఒక్కసారిగా కిరోసిన్‌ పోసుకొని, నిప్పంటించుకుని, పరుగులు తీశారు.

 ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

దీంతో అక్కడే ఉన్న అదే వీధికి చెందిన శేషాద్రి అనే వ్యక్తి తన చొక్కా విప్పి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సభావేదిక సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నాయకులు, పోలీసులు పరుగులు తీశారు. అప్పటికే మంటల్లో చిక్కున్న కోటిని కాపాడేందుకు వారూ ప్రయత్నించారు.

 ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇద్దరు క్షతగాత్రులను పోలీసులు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడి అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో మునికోటికి 97 శాతం గాయాలయ్యాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంధ్య తెలిపారు.

 ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వారిని తమిళనాడులోని వేలూరు (తమిళనాడు)లోని సీఎంసీకి తరలించారు. రుయాలో చికిత్స పొందుతూనే కోటి కాసేపు మీడియాతో మాట్లాడాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే భాగంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని తెలిపాడు.

 ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కోటిని రక్షించడానికి ప్రయత్నించి గాయపడ్డ శేషాద్రి మాట్లాడుతూ పోరుసభలో నాయకులు మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న కోటి ఒక్కసారిగా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడని చెప్పారు. పరుగులు తీస్తూ రావడంతో వెంటనే చొక్కా విప్పి ఆర్పేందుకు ప్రయత్నించానని తెలిపారు.

 ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ డిమాండ్, వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఈ ప్రమాదం జరిగిన వెంటనే కోటి తమ్ముడు మురళి, ఆయన భార్య హుటాహుటిన రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలోనే కాంగ్రెస్‌ నేతలు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. అక్కడికక్కడే రూ.2లక్షల నగదును కోటి సోదరుడు మురళికి అందజేశారు. గాయపడిన శేషాద్రికి సైతం రూ.50వేలు అందజేశారు.

English summary
The Congress today organised a public meeting in the temple town of Tirupati to demand that the Centre grant special status to Andhra Pradesh, where a party worker tried to immolate himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X