వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనారోగ్యంతో కాంగ్రెస్ మాజీ మహిళా ఎమ్మెల్యే మృతి

|
Google Oneindia TeluguNews

కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా పామర్రు నియోజకవర్గం మాజీ మహిళా ఎమ్మెల్యే గాదం కమలాదేవి(86) గురువారం ఉదయం మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెని చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆమె అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ కోలుకోలేదు. ఈ నేపథ్యంలో గురువారం పరిస్థితి మరింత విషమించి మృతిచెందారు. గాదం కమలాదేవి 1972లో పామర్రు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కాలంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా, టీటీడీ సభ్యురాలుగా, క్వయర్ బోర్డ్ సభ్యురాలుగానూ ఆమె పనిచేశారు.

Congress Ex MLA Gadam Kamaladevi Passed Away

మాజీ ఎమ్మెల్యే కమలాదేవికి నలుగురు సంతానం కాగా వీరు రమేష్, మహేష్, హరీష్ అనే ముగ్గురు కుమారులు, అనురాధ అనే కుమార్తె ఉన్నారు. కమలాదేవి పీఏసీ చైర్మన్‌గా కూడా అప్పట్లో బాధ్యత నిర్వహించడం గమనార్హం.

కమలాదేవి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాల నిర్వహణలో గాదం కమలాదేవి ముందంజలో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. కాకినాడ నగరంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడానికి ఆమె తన వంతు సహాయం అందించారని కొని యాడారు.

English summary
Congress Ex MLA from Pamarru constituency Gadam Kamala Devi passed away at Private hospital in Kakinada on Thursday. She was 86.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X