• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్.. ఇవే ప్రశ్నలు మోదీని అడగరేం? -మీరు, నవీన్ బీజేపీకి మిత్రులేకదా! -వ్యాక్సిన్ల రాజకీయంలో అనూహ్య మలుపు

|

దేశంలో కరోనా మహమ్మారి రెండోదశ ఉధృతి తగ్గుముఖం పడుతున్నా, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాకుంటే, అతి త్వరలోనే మూడో దశ విలయం ఉత్పన్నమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో, వ్యాక్సిన్ల చుట్టూ నెలకొన్న రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రాలకు-కేంద్రానికి, రాష్ట్రాలకు-రాష్ట్రాలకు మధ్య యుద్ధంలా మారింది. వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్ల సేకరణలో ఇబ్బందులు, రాష్ట్రాల మధ్య ఐక్యతను ప్రస్తావిస్తూ ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయగా, విపక్ష కాంగ్రెస్ మాత్రం వాటిపై సునిశిత విమర్శలు చేస్తున్నది..

అది కేసీఆర్ గొప్పతనమే కదా -ఈటల ఆస్తుల గ్రాఫ్ పైపైకి -10 రోజుల్లో కనుమరుగు: పల్లా, గువ్వల ఫైర్అది కేసీఆర్ గొప్పతనమే కదా -ఈటల ఆస్తుల గ్రాఫ్ పైపైకి -10 రోజుల్లో కనుమరుగు: పల్లా, గువ్వల ఫైర్

జగన్‌కు దిమ్మతిరిగే కౌంటర్

జగన్‌కు దిమ్మతిరిగే కౌంటర్

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేవంతం కాకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు ఒకే మాట మీద ఉండాలని, అందరం కలిసి ఒకే గొంతుక వినిపిద్దామని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం నాడు ఇతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. వ్యాక్సిన్ల కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లకు వెళ్లినా స్పందన లేదని, వాటి ఆమోదం కేంద్రం చేతుల్లోనే ఉందని జగన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల విషయంలో జగన్ లేవనెత్తిన అంశాలపై విపక్ష కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను గందరగోళంగా మార్చిన ప్రధాని మోదీని, కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించడంలేదంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ నిలదీశారు.

మోదీ సర్కారుపై వ్యాక్సిన్ పిడుగు -పూర్తి డేటా హిస్టరీ ఇవ్వండన్న సుప్రీంకోర్టు -అసాధారణ ఆదేశాలుమోదీ సర్కారుపై వ్యాక్సిన్ పిడుగు -పూర్తి డేటా హిస్టరీ ఇవ్వండన్న సుప్రీంకోర్టు -అసాధారణ ఆదేశాలు

టీకాలను రాజకీయం చేసిందెవరు?

టీకాలను రాజకీయం చేసిందెవరు?

‘‘తన లేఖలను చూసిన తర్వాత జగన్ ను నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా.. అసలు వ్యాక్సిన్ల సమస్యను కేంద్రం వర్సెస్ రాష్ట్రాలుగా మార్చిందెవరు? 18-44 సంవత్సరాల వారికి టీకాలు అందించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవాలని ఏకపక్షంగా ఎవరు నిర్ణయించారు? ఈ విధానాన్ని రూపొందించడానికి ముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించ లేదు? సీఎంలకు రాసిన లేఖలో చాలా అంశాలను లేవనెత్తిన మీరు.. ఈ ప్రశ్నలను ప్రధాని మోదీని ఎందుకు అడగకూడదు?'' అంటూ జైరాం రమేశ్.. జగన్ ను కడిగేశారు. అలాగే,

కేంద్రానికి సహకరించాలన్న నవీన్ పైనా

కేంద్రానికి సహకరించాలన్న నవీన్ పైనా

18 నుంచి 44 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్లు అందించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడం, దేశ జనాభాలో అత్యధిక శాతం గ్రూపు అదే కావడంతో రాష్ట్రాలపై భారం పడటం, రాష్ట్రాలు సొంతగా వ్యాక్సిన్లు సేకరించుకోలేని స్థితిలో మళ్లీ కేంద్రంపైనే ఆధారపడటం, గ్లోబల్ టెండర్లకు వెళ్లినా, అందుకు కేంద్రం అనుమతి తప్పనిసరి కావడంతో రాష్ట్రాలు ఇరకాటంలో పడ్డాయన్నది వాస్తమని, కాబట్టి సీఎంలు అందరూ కేంద్రానికి సహకరించడం తప్ప మరోదారి లేదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇటీవల అందరు సీఎంలకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. తాను ప్రధాని మోదీకి కూడా లేఖ రాసినట్లు నవీన్ చెప్పుకున్నా, ఆ కాపీని పబ్లిక్ డొమెయిన్ లో పెట్టకపోవడం అనుమానాలకు తావిచ్చినట్లయింది. నవీన్ తీరుపై..

పట్నాయక్ సన్నాయి నొక్కులు..

పట్నాయక్ సన్నాయి నొక్కులు..

వ్యాక్సిన్ల విషయంలో జగన్ లాగే నవీన్ పట్నాయక్ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ‘‘వ్యాక్సిన్ల విషయంలో ఐక్యత కోసం మిగతా సీఎంలకు నవీన్ పట్నాయక్ లేఖలు రాయడం మంచిదే. అయితే, ఇదే వాదనను మోదీకి ఎందుకు వినిపించడంలేదు?, నవీన్ ప్రధానికి లేఖరాయలేదేం? నిజానికి నవీన్ బీజేడీ గడిచిన 7ఏళ్లుగా బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నది. అందుకే వీళ్లు ప్రధానిని ప్రశ్నించడంలేదా?'' అని జైరాం ప్రశ్నించారు.

వ్యాక్సిన్ల రాజకీయాలు రోజురోజుకూ..

వ్యాక్సిన్ల రాజకీయాలు రోజురోజుకూ..

కొవిడ్ టీకాల కోసం జనం ఎదురుచూస్తుండగా, వీలైనంత తొందరగా టీకాలను సేకరించాల్సిపోయి, పాలకులంతా పరస్పర నిందారోపణలతో కాలం వెలిబుచ్చుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్ల విషయంలో మోదీ విధానాలను నిలదీస్తూ కాంగ్రెస్ సహా 12 ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదిన విధానాలను ఇప్పటికే కేంద్రానికి పంపాయి. కానీ దానిపై ఎలాంటి ప్రతిస్పదన రాలేదని, భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని జైరాం రమేశ్ చెప్పారు. శుక్రవారం నాటికి మొత్తం 24 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం చెప్పుకుంది. అయితే దేశ జనాభాలో ఇది కేవలం 3శాతంలోపే ఉండటం, మూడో దశ విలయం త్వరలోనే వస్తుందని, కొద్ది మందికి టీకాలేసి, చాలా మందికి వేయకపోవడం వల్ల వైరస్ మరింతగా బలపడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నా..వ్యాక్సిన్లపై రాజకీయాలు రోజురోజుకూ పెద్దవవుతున్నాయేగానీ పరిష్కారం దిశగా అడుగులు పడటంలేదు..

English summary
The Opposition, especially congress remains sceptical on letters written by Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy and Odisha Chief Minister Naveen Patnaik to fellow Chief Ministers criticising the Centre’s vaccination policy. Senior Congress leader Jairam Ramesh questioned both ap cm jagan and odisha cm Patnaik, asking why they could not pose the same questions to Prime Minister Narendra Modi over vaccination policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X