వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్షకుమార్‌ సంచలనం- జగన్‌, మంత్రులపై సీఐడీకి ఫిర్యాదు- అరెస్ట్‌, ప్రాసిక్యూట్‌ కోరుతూ

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఇవాళ ఏపీ సీఐడీకి ఓ సంచలన ఫిర్యాదు చేశారు. వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకం కోసం పేదల అసైన్డ్‌ భూములను తీసుకున్న వ్యవహారంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌పై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో వీరిని అరెస్టు చేసి ప్రాసిక్యూట్‌ చేయాలని ఆయన కోరారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పేదలకు ఇళ్ల స్ధలాల పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూములపై ఇప్పటికే పలు వివాదాలు నడుస్తుండగా.. హర్షకుమార్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

 నవరత్నాల అమలు కోసం అసైన్డ్‌ భూములా ?

నవరత్నాల అమలు కోసం అసైన్డ్‌ భూములా ?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలకు ఇళ్ల పధకం కోసం అధికారులు చాలా జిల్లాల్లో భారీ ఎత్తున భూములు సేకరించారు. ఇందులో అన్ని రకాల భూములున్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్‌ భూములు కూడా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా తీసుకున్న భూములకు ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించలేదని కాంగ్రెస్‌ ఎంపీ హర్షకుమార్ ఆరోపిస్తున్నారు. అసైన్డ్‌ భూములు తీసుకుని దళితుల్ని మోసం చేశారంటూ ఆయన ఇప్పుడు సీఐడీని ఆశ్రయించారు. దీంతో ఇళ్ల స్ధలాల భూసేకరణ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

హైకోర్టులో వేల కొద్దీ ఫిర్యాదులు

హైకోర్టులో వేల కొద్దీ ఫిర్యాదులు

దళితులకు చెందాల్సిన అసైన్డ్‌ భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కొన్న వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టులో వేల కొద్దీ కేసులు నడుస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం నవరత్నాల కోసం మరోసారి దళితుల నుంచి భూములు లాక్కోవడంపై హర్షకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళితులకు చెందాల్సిన అసైన్డ్‌ భూముల్ని లాక్కొని నష్టపరిహారం కూడా ఇవ్వకుండా సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌ తమ జేబులు నింపుకున్నారని హర్షకుమార్‌ ఆరోపిస్తున్నారు.

సీఐడీకి హర్షకుమార్ ఫిర్యాదుతో కలకలం

సీఐడీకి హర్షకుమార్ ఫిర్యాదుతో కలకలం

రాష్ట్రంలో వేలాది ఎకరాలు అసైన్డ్ భూముల్ని దళితుల నుంచి బలవంతంగా లాక్కొన్న వ్యవహారంలో సీఎం జగన్, మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై సీఐడీ అదనపు డీజీకి హర్షకుమార్‌ ఫిర్యాదు చేశారు. జగన్‌ తో పాటు మంత్రుల్ని అరెస్టు చేసి ప్రాసిక్యూట్‌ చేయాలంటూ హర్షకుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల భూముల్ని వారి అనుమతి లేకుండా లాక్కోవడం రాజ్యాంగ ఉల్లంఘన అని సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో హర్షకుమార్‌ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీఐడీని హర్షకుమార్‌ కోరారు.

చంద్రబాబు తరహాలోనే జగన్‌పైనా కేసు పెడతారా ?

చంద్రబాబు తరహాలోనే జగన్‌పైనా కేసు పెడతారా ?


ఇప్పటికే రాజధాని అమరావతి భూముల విషయంలో దళితులకు కేటాయించిన అసైన్డ్‌ భూముల యాజమాన్య హక్కులు మార్చిన వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపైనా సీఐడీ కేసులు పెట్టింది. మంగళగిరి ఎమ్మల్యే ఆర్కే దళితుడు కాకపోయినా ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అట్రాసిటీ కేసులు పెట్టింది. హైకోర్టు చంద్రబాబు, నారాయణపై జరగాల్సిన విచారణకు స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు హర్షకుమార్‌ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేస్తుందా, చేయలేకపోతే దీన్ని ఎలా సమర్ధించుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది.

English summary
former mp and congress leader harsha kumar on monday complains cid on alleged distribution of assigned lands to navaratnalu scheme in the state and seek arrest of cm ys jagan, his ministers botsa satyanarayana and krishna das also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X