కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు జిల్లాలో కోట్లకు షాక్: టిడిపిలో చేరిన ముఖ్య అనుచరుడు

కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంత్ రెడ్డి ఆదివారం టిడిపిలో చేరారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Congress leader along with 500 followers joined TDP టిడిపిలో చేరిన అనుచరుడు | Oneindia Telugu

కర్నూలు: కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంత్ రెడ్డి ఆదివారం టిడిపిలో చేరారు.

టిడిపిని నిలదీయట్లేదని బిజెపి పెద్దల అసహనం: బాబుతో తేల్చుకునే వారికే చీఫ్?టిడిపిని నిలదీయట్లేదని బిజెపి పెద్దల అసహనం: బాబుతో తేల్చుకునే వారికే చీఫ్?

ముందస్తు ప్రచారం, పార్టీల ఆపరేషన్

ముందస్తు ప్రచారం, పార్టీల ఆపరేషన్

ముందస్తు ఎన్నికలకు అవకాశమున్నదనే ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రం కూడా అదే ఆలోచనతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు పట్టులేని ప్రాంతాల్లో కీలక నేతలను టిడిపి, వైసిపిలు తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి.

 వైసిపి, టిడిపి వైపు నేతల చూపు

వైసిపి, టిడిపి వైపు నేతల చూపు

ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి భారీగా చేరికలు కనిపించాయి. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మరికొంతమంది వైసిపి నుంచి టిడిపిలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ సీట్ల గొడవ, స్థానిక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని టిడిపి, వైసిపిల వైపు నేతలు చూస్తున్నారు.

టిడిపిలో చేరిన హనుమంత రెడ్డి

టిడిపిలో చేరిన హనుమంత రెడ్డి

ఆదివారం కర్నూలు జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంటలో ఐదు వందల మందితో కాంగ్రెస్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంత రెడ్డి టిడిపిలో చేరారు. ఆయనతో పాటు కొందరు సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మజ్లిస్ నేత కూడా

మజ్లిస్ నేత కూడా

మరోవైపు, జిల్లాకు చెందిన మజ్లిస్ నేత అబ్దుల్ రెహ్మాన్ కూడా టిడిపి కండువా కప్పుకున్నారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ సమక్షంలో ఆయన ఆయన టిడిపిలో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు చెప్పారు.

English summary
Congress leader Hanumantha Reddy, along with 500 followersm, joined in Telugu Desam in Kurnool district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X