హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరినీ కించపరచలేదంటూ స్పీకర్‌కు కేవీపీ మరో లేఖ: సభాహక్కుల ఉల్లంఘనేనన్న యనమల

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో తొలగింపుపై స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు కేవీపీ రామచంద్రరావు మరో లేఖ రాశారు. ఆ లేఖలో గతంలో తాను రాసిన లేఖలో ఎవరినీ కించపరచలేదని, అమర్యాదకంగా లేఖ రాయలేదని అందులో పేర్కొన్నారు.

తాను రాసిన మొదటి లేఖ అందలేదన్న తర్వాత మాత్రమే రెండో లేఖ రాశినట్లు ఆయన అందులో పేర్కొన్నారు. తాను రాసిన లేఖలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే, వివరణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు
15 నిమిషాల వాయిదా అనంతరం సభ ప్రారంభమైంది. వైయస్ ఫోటో తొలగింపుపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. స్పీకర్ కోడెలకు కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖను సభాహక్కలు ఉల్లంఘనగా పరిగణించాలన్నారు.

Congress Leader KVP Ramachandra Rao writes Letter to Assembly Speaker Kodela

స్పీకర్ అనుమతి లేకుండా అసెంబ్లీ ఆవరణలో వైయస్ ఫోటో పెట్టడం సరికాదన్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు లేకుండానే చర్యలు తీసుకోవచ్చని మంత్రి యనమల సూచించారు. అసెంబ్లీ లాంజ్‌లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో తీసి వేయడం పైన బుధవారం వైసీపీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన స్పీకర్ కోడెల అసెంబ్లీ లాంజ్‌లో సభాపతుల ఫోటోలు మాత్రమే ఉంటాయని, లాంజ్‌లో ఇతరుల ఫోటోలు ఉండవని సభాపతి కోడెల శివప్రసాద రావు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాలులో ఉంటాయని చెప్పారు. విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని చెప్పారు.

వైయస్ ఫోటో పెట్టినప్పుడు నాడు ఆ సంప్రదాయం పాటించలేదన్నారు. అసెంబ్లీ, జనరల్ పర్సస్ కమిటీ అనుమతి లేకుండా ఎవరి ఫోటోలు పెట్టవద్దన్నారు. వైయస్ ఫోటో తొలగింపుపై రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు తనకు లేఖ రాశారని చెప్పారు. సభను కించపరిచేలా ఆయన లేఖ రాశారన్నారు. ఎంపీ కెవిపి లేఖను మీరు సమర్థిస్తారా అని కోడెల వైసిపి సభ్యులను ప్రశ్నించారు.

English summary
Congress Leader KVP Ramachandra Rao writes Letter to Assembly Speaker Kodela.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X