వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీమకు రాజధానిని దూరం చేశారు: చంద్రబాబుపై శైలజానాథ్ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లతాడుతూ.. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు రాష్ట్ర రాజధానిని రాయలసీమకు దక్కకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో సొంత జిల్లాలో తాగునీటి పథకం రద్దు చేశారని మండిపడ్డారు. తాగునీటి పథకానికి గత ప్రభుత్వం రూ. 7, 390 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.
అన్ని నిధులు కేటాయించిన ఆ పథకాన్ని ఇప్పుడు ఎందుకు రద్దు చేశారో? చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పథకాలను రద్దు చేయడం వెనక మతలబు ఏమిటని చంద్రబాబు ప్రభుత్వాన్ని శైలజానాథ్ నిలదీశారు.