అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి హత్య: రాజధాని శంకుస్థాపనకు ప్రధాని ఏ ముఖం పెట్టుకుని వస్తారు: సుంకర పద్మశ్రీ ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: కాంగ్రెస్ నాయకులు సుంకర పద్మశ్రీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. విశాఖపట్నంలో రాజధాని శంకుస్థాపన పనులకు ప్రధానమంత్రి ఏ ముఖం పెట్టుకుని వస్తారని, ఆయనకు సిగ్గులేదా అని నిలదీశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్‌లో ఘాటు విమర్శలు చేశారు. ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులను తీసుకుని రావడానికి ఏకపక్షంగా, అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారని ఆమె ధ్వజమెత్తారు.

బెంగళూరు అల్లర్లలో కుట్ర: ఫస్ట్ వికెట్: పక్కా స్కెచ్: బీజేపీ మంత్రి డౌట్: ఎస్డీపీఐ నేత అరెస్ట్బెంగళూరు అల్లర్లలో కుట్ర: ఫస్ట్ వికెట్: పక్కా స్కెచ్: బీజేపీ మంత్రి డౌట్: ఎస్డీపీఐ నేత అరెస్ట్

జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదనే తాము భావిస్తున్నామని అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో న్యాయస్థానాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. న్యాయస్థానంలో వ్యతిరేక తీర్పు వస్తే.. జగన్ ప్రభుత్వం దాన్ని అనుసరించక తప్పదని అన్నారు. ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములను ఇచ్చిన వేలాది మంది రైతులతో ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ.. నరేంద్ర మోడీ, వైఎస్ జగన్ వారి గోడును పట్టించుకోకుండా అమరావతిని హత్య చేస్తున్నారని మండిపడ్డారు.

Congress leader Sunkara Padmasri criticised to PM Narendra Modi

భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు వారికి వంత పాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విశాఖలో శంఖుస్థాపనకి రావాలీ అనుకుంటే అమరావతిలో మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తొలగించాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని శంకుస్థాపన పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి ఆహ్వాన పత్రికను పంపించిందనే విషయం మీడియా ద్వారా తెలుసుకున్నానని, ఈ కార్యక్రమానికి రావడానికి మోడీకి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.

Recommended Video

AP CM YS Jagan Launches YSR Cheyutha Scheme || Oneindia Telugu

ప్రధాని హోదాలోనే ఆయన అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, మళ్లీ వైజాగ్‌లో ఏ మొహం పెట్టుకొని ఇంకో రాజధాని శంకుస్థాపనకు వస్తారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులు పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అలాగే మన దేశానికి కూడా రెండో రాజధాని అవసరం ఉందని అన్నారు. అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. 33 వేల ఎకరాలను గత ప్రభుత్వానికి అందించిన రైతుల పొట్టకొట్టడానికి వైసీపీ, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు.

English summary
Congress leaer Sunkara Padmasri strongly criticising to Prime Minister Narendra Modi on three capital issue in the Andhra Pradesh. Sunkara Padmasri alleged that Narendra Modi himself laying foundation stone to construction of AP's capital city Amarvati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X