వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గురించి ఆలోచన లేదు: రఘువీరా, మేం సిగ్గుపడాలి: పల్లంరాజు

వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు.కాంగ్రెస్, జగన్ ఒక్కటవుతాయనే వాదనల నేపథ్యంలో ఆయన పైవిధంగాస్పందించారు.

|
Google Oneindia TeluguNews

కాకినాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు. కాంగ్రెస్, జగన్ ఒక్కటవుతాయనే వాదనల నేపథ్యంలో ఆయన పైవిధంగాస్పందించారు.

మహేష్‌ను లాగకండి, టిడిపికి మద్దతివ్వలేదు, దిగజారొద్దు: వైసిపిపై జయదేవ్మహేష్‌ను లాగకండి, టిడిపికి మద్దతివ్వలేదు, దిగజారొద్దు: వైసిపిపై జయదేవ్

కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడారు.

Congress leaders campaign in Kakinada

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ సిటీ పేరుతో కాకినాడ ప్రజలను మభ్యపెడుతున్నాయని రఘువీరా రెడ్డి ఆరోపించారు. స్మార్ట్ సిటీ పథకం కింద కాకినాడకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.

2004 నుంచి 2014 వరకు కాకినాడకు కాంగ్రెస్‌ ప్రభుత్వ చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. కాంగ్రెస్‌ బలమున్న 17 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో నిలిపినట్లు చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు పేర్కొన్నారు.

సిగ్గుపడాల్సిన విషయమే: పల్లం రాజు

కాంగ్రెస్ పార్టీ 17 డివిజన్లలో పోటీ చేస్తోందని, అన్ని డివిజన్లలో అభ్యర్థులను పోటీ పెట్టలేని పరిస్థితికి సిగ్గుపడాల్సిన విషయమేనని పల్లం రాజు అన్నారు.

ఎన్నికలకు సమాయత్తం కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. హఠాత్తుగా ఎన్నికలు వస్తాయని ఊహించలేదన్నారు. ఈ పరిస్థితి తమకు (కాంగ్రెస్) గుణపాఠమని చెప్పారు. 10 వార్డుల్లో గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు.

English summary
Congress leaders Raghuveera Reddy and Pallam Raju campaign in Kakinada municipal elections on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X