వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి ప్రభుత్వంలో కిరణ్‌పై విచారణ: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

|
Google Oneindia TeluguNews

Congress MLCs fires at former CM Kiran Kumar Reddy
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంతో విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డిలు అన్నారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే ఆరు నెలల ముందు నుంచి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టాలని త్వరలో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వాన్ని కోరతామని వారు తెలిపారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డిపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లోని అవినీతిని పారద్రోలుతామని వారు తేల్చి చెప్పారు.

రాష్ట్రాన్ని సాధించుకుని శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాబోతున్న తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు యాదవరెడ్డి, జగదీశ్వర్, భూపాల్ రెడ్డిలు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గన్‌పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.

తమ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇక్కడి ప్రజల తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను గెల్చుకుని సోనియా గాంధీకి కానుకగా అందిస్తామని వారు చెప్పారు.

English summary

 Telangana Congress MLCs Yadava Reddy and jagadeeswar Reddy and Bhupal Reddy fired former CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X