వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 8మందిపై వేటు వేయండి: టి కాంగ్రెస్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్టీ విప్ ధిక్కరించిన తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు శాసనమండలి (కౌన్సిల్) ఛైర్మన్ స్వామిగౌడ్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడైన డి. శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి ఈ మేరకు పిటీషన్ అందజేశారు.

ప్రభుత్వం కౌన్సిల్ చైర్మన్ ఎన్నికను హడావుడిగా నిర్వహించినందున తాము ఎన్నికను బహిష్కరించి, సభ నుంచి వాకౌట్ చేశామని వారు తెలిపారు. చైర్మన్ ఎన్నిక గురించి ప్రభుత్వం తమతో ముందే మాట్లాడి ఉంటే సహకరించే వాళ్ళమని అన్నారు. చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా స్వామిగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఫారూఖ్ హుస్సేన్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

అయితే డిఎస్ మాట్లాడుతుండగానే ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ ఆ రోజున సభ నుంచి వాకౌట్ చేసింది. కాగా, అప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కెఆర్ ఆమోస్, భానుప్రసాద్ తోపాటు పలువురు టిఆర్‌ఎస్‌లో చేరారు.

ఎమ్మెల్సీ యాదవరెడ్డి బహిష్కరణ

కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయనను తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పార్టీ నుంచి బహిష్కరించారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన విప్‌ను యాదవ రెడ్డి ధిక్కరించినందున ఆయనపై వేటు పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఛైర్మన్‌కు ఫిర్యాదు

ఛైర్మన్‌కు ఫిర్యాదు

పార్టీ విప్ ధిక్కరించిన తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు శాసనమండలి (కౌన్సిల్) ఛైర్మన్ స్వామిగౌడ్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.

ఛైర్మన్‌కు ఫిర్యాదు

ఛైర్మన్‌కు ఫిర్యాదు

తెలంగాణ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడైన డి. శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, తదితరులు చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి ఈ మేరకు పిటీషన్ అందజేశారు.

ఛైర్మన్‌కు ఫిర్యాదు

ఛైర్మన్‌కు ఫిర్యాదు

ప్రభుత్వం కౌన్సిల్ చైర్మన్ ఎన్నికను హడావుడిగా నిర్వహించినందున తాము ఎన్నికను బహిష్కరించి, సభ నుంచి వాకౌట్ చేశామని వారు తెలిపారు.

ఛైర్మన్‌కు ఫిర్యాదు

ఛైర్మన్‌కు ఫిర్యాదు

చైర్మన్ ఎన్నిక గురించి ప్రభుత్వం తమతో ముందే మాట్లాడి ఉంటే సహకరించే వాళ్ళమని అన్నారు. చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా స్వామిగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఫారూఖ్ హుస్సేన్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

English summary
Congress MLCs on Monday met Telangana Council Chairman Swamy Goud to suspend their party MLCs for allegedly support TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X