• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోలవరంపై అన్నీ అసత్యాలే!...స్పీకర్ కోడెలకు కేవీపీ మరో ఘాటు లేఖ;పరిశీలనకు కేంద్ర బృందం

By Suvarnaraju
|

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరో లేఖ రాశారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌పై కేవీపీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

కోడెల శివప్రసాద్‌రావు స్పీకర్ పదవిలో ఉండి పోలవరంపై అసత్యాలు మాట్లాడుతున్నారని కెవిపి దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు గురించి స్పీకర్ కోడెల శివప్రసాద్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కేవీపీ హితవు పలికారు. ఈ విషయమై ఇంతకుముందు కోడెలకు 28 ప్రశ్నలతో లేఖ రాశానని...కానీ వాటికి కోడెల అసత్యాలతో బదులిచ్చారని వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వ గణాంకాలనే కోడెల వల్లెవేస్తున్నారని కెవిపి ధ్వజమెత్తారు.

 Congress MP KVP Writes One More Letter To AP Speaker Kodela

పోలవరంపై కోడెల సమాధానం ఆయన బాధ్యతారాహిత్యాన్ని,అవగాహనరాహిత్యాన్ని తెలియజేస్తుందని అన్నారు. పోలవరం అంటే హెడ్‌వర్క్స్‌ మాత్రమే కాదని, ఆ విషయాన్ని ముందు కోడెల తెలుసుకోవాలని చెప్పారు. పోలవరంపై తప్పిదాలను స్పీకర్‌ కోడెల సమర్ధిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలవరంపై ప్రభుత్వం మీకు తప్పుడు సమాచారం ఇస్తోందని...ఒకసారి చెక్ చేసుకోవాలని హితవు పలికారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలవరం ఘనత మాదేనని చెప్పుకుంటున్నారని కెవిపి విమర్శించారు. చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడు...అవసరమైతే చార్మినార్‌ కూడా తానే కట్టానని చెబుతాడని ఎద్దేవా చేశారు. వాస్తవానికి పోలవరం సాధించిన ఘనత ముమ్మాటికీ వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డికే దక్కుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్‌ అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లిందీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

టిడిపి ప్రభుత్వానికి ఇప్పటివరకు పోలవరానికి పీఆర్-2 తెచ్చుకోవడం చేతకాలేదని కెవిపి దుయ్యబట్టారు. అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని...పోలవరంపై చంద్రబాబు చెబుతున్న అవాస్తవాలన్నీ ఆయన తాత్కాలిక ప్రయోజనాల కోసమేనన్నారు. ఇక కొండవీటి వాగు విషయానికొస్తే అది ఒక డ్రైనేజీ అని...కానీ చివరకు ఇప్పుడు దాన్ని కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుగా చెబుతున్నారని కేపీవీ ఆరోపించారు.

మరోవైపు కేంద్ర జల సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌ వైకే శర్మ నేతృత్వంలోని ఒక బృందం బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రానికి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ముందు రాజమండ్రి వెళ్లి...గురువారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస కమిషనర్‌ రేఖారాణి పంపిన నివేదిక ప్రకారం గతంలో ఇచ్చిన గణాంకాలు, కొత్త అంచనాల మధ్య తేడాలను ఈ సందర్భంగా ఈఎన్‌సీ బృందం పరిశీలిస్తుంది. ఎలాంటి మార్పులు, చేర్పులూ లేకుండా అంతా పక్కాగా ఉందని భావిస్తే ఈ సమాచారాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాకు ఈఎన్‌సీ పంపుతారని తెలిసింది.

English summary
Vijayawada:Congress MP KVP Ramachandra Rao write another letter to AP speaker Kodela Siva Prasad over Polavaram issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X