వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు ఎంపీలు స్టెప్పులేశారు, చిందేశారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతలు చెప్పడానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో గంభీరోపన్యాసాలే కాదు, వినోదాన్ని అందించే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గాయకుల పాటలకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తదితరులు చిందేశారు.

హెచ్చరికలు, సవాళ్లు వంటి గంభీరమైన ప్రసంగాలు పక్కకు పోయి అహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది. రసమయి బాలకిషన్ వేదికపైకి రాగానే..జనంతో పాటు వేదికంతా ఊగింది. వేదికపై ఉన్న తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు బాలకిషన్‌కు జత కలిశారు. ఆయన పాటకు పాదాలు కదిపారు. చేతులు తిప్పుతూ హుషారు చేశారు. ఆయన పాటకు లయబద్ధంగా స్టెప్పులు వేశారు.

బీబీనగర్ నిమ్స్‌నుంచి భువనగిరి పట్టణం వరకు సాగిన ర్యాలీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంపీలు మధు యాష్కీ, అంజన్‌ కుమార్‌ యాదవ్, సురే ష్‌షట్కర్ ముందు నడవగా వేలాది ద్విచక్ర వా హనాలు వారిని అనుసరించాయి.

భారీగా ప్రజలు

భారీగా ప్రజలు

నల్లగొండ జిల్లా భువనగిరిలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.

వేదిక మీద పార్లమెంటు సభ్యులు

వేదిక మీద పార్లమెంటు సభ్యులు

భువనగిరిలో సభా వేదికకు వచ్చే ముందు అమరుల స్థూపానికి ఎంపీలంతా నివాళులర్పించారు. పెద్ద సం ఖ్యలో మతాబులు పేలుస్తూ భారీ ర్యాలీ సభా వేదికకు చేరుకుంది.

నిమ్స్‌ను అభివృద్ధి చేసుకుందాం

నిమ్స్‌ను అభివృద్ధి చేసుకుందాం

సమైక్య రాష్ట్రంలో బీబీనగర్ నిమ్స్ నిర్లక్ష్యానికి గురైన తీరును తన సహచర ఎంపీలకు రాజగోపాల్‌రెడ్డి వివరించారు. కొత్త రాష్ట్రంలో ఎయిమ్స్ తరహాలో నిమ్స్ ఆస్పత్రిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

వ్యూహాత్మకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వ్యూహాత్మకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

భారీ బహిరంగ సభ వేదికను రాజగోపాల్‌రెడ్డి బాగా ఉపయోగించుకున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ, సహచర ఎంపీలు ఎలా కృషి చేశారో ఆయన వివరించారు.

ఎంపీల ర్యాలీ

ఎంపీల ర్యాలీ

కాంగ్రెసు ఎంపీలు బీబీనగర్ నిమ్స్‌ను తన సహచర ఎంపీలతో కలిసి కోమటిరెడ్డి సందర్శించారు. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్‌లో ఎంపీలు భారీ ర్యాలీగా భువనగిరి పట్టణం వైపు కదిలారు.

ఊరూరా స్వాగతం

ఊరూరా స్వాగతం

బీబీ నగర్ నుంచి ర్యాలీ సాగుతుండగా మార్గ మధ్యంలో ఊరూరా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున శాలువాలు, పూలదండలు, జ్ఞాపికలతో ఎంపీలను సత్కరించారు. వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై సోనియా అంటూ నినదించారు.

English summary
Congress Telangana MPs at Bhongir public meeting in Nalgonda district turned into a entertainment stage at the end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X