వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ వారి ఉద్యోగాలు: చిరు సహా వీరి తిరుగు బాట!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. సీమాంధ్ర నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెసు పార్టీ నుండి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలుపొందలేదు.

కాంగ్రెసు పార్టీ ఓటమి నేపథ్యంలో పలువురు నేతలు ఇప్పుడు తమ పాత వృత్తుల వైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి ముఖానికి రంగు వేసుకోనున్నారు. చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ఢిల్లీలో, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ వైఫల్యం నేపథ్యంలో చిరంజీవి తన 150వ చిత్రం పైన దృష్టి సారించనున్నారు. అదే విధంగా గతంలో వైద్యులుగా, న్యాయవాదులుగా ఉన్న కాంగ్రెసు నేతలు తిరిగి తమతమ వృత్తుల పైన దృష్టి సారించారు.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి ముఖానికి రంగు వేసుకోనున్నారు. చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

కిల్లి కృపారాణి

కిల్లి కృపారాణి

మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త కిల్లి రామ్మోహన్ రావు వృత్తిరీత్యా వైద్యులు. వారికి శ్రీకాకుళంలో ఓ నర్సింగ్ హోం ఉంది. వారు తిరిగి తమ ఆసుపత్రిలో వైద్యులుగా మారనున్నారట. మాజీ మంత్రి శైలజానాథ్, ఆయన సతీమణి... ఇద్దరు కూడా మెడికల్ ప్రాక్టీస్ వైపు దృష్టి సారించనున్నారట.

కొండ్రు మురళీ

కొండ్రు మురళీ

మాజీ మంత్రి కొండ్రు ముళీ మోహన్ తన విద్యా సంస్థలను నడపనున్నారు. ఆయన తన పూర్తి దృష్టిని తన సొంత విద్యా సంస్థల పైనే పెట్టనున్నారట.

రఘువీరా రెడ్డి

రఘువీరా రెడ్డి

మాజీ మంత్రి, ఎపిసిసి అధ్యక్షులు రఘవీరా రెడ్డి ఓ వైపు కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలు చూస్తూనే వ్యవసాయం చూసుకోనున్నారు. ఇక నుండి అతను తన పొలాల వెంట నడవనున్నారు. ఇటీవల నామినేషన్ సందర్భంగా ఆయన ఎడ్ల బండి పైన వచ్చి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

డొక్కా మాణిక్యవర ప్రసాద్

డొక్కా మాణిక్యవర ప్రసాద్

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ న్యాయవాది. ఆయన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌లో తన పేరును నమోదు చేసుకోవాలని భావిస్తున్నారట. రాజకీయాల పైన కూడా దృష్టి సారించనున్నారు. మరో సీనియర్ నేత గిడుగు రుద్రరాజు ఇప్పటికే సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఇతను కూడా రాజకీయాల పైన దృష్టి సారించనున్నారు.

ఆనం సోదరులు

ఆనం సోదరులు

ఆనం సోదరులు (ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలు రాజకీయాల నుండి తప్పుకునే అవకాశముంది. వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చారు.

English summary
Till last month they were ministers, yesterday they were former ministers, but tomorrow they will be doctors, advocates, agriculturists and so on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X