వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేలిపోయిందట: బాబు-జగన్ '2019 వార్'పై రాహుల్ సర్వే.. ఇదీ సీట్ల లెక్క!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే చాలు.. సర్వేల మోత మోగిపోవడం ఖాయం. ఏ సర్వేలో ఏదెంత నిజమో.. ఏదెంత అవాస్తవమో అన్నది పక్కనపెడితే.. ఏ పార్టీ సర్వే చేయించుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు రావడం మాత్రం సర్వ సాధారణమైపోయింది. ఏపీ విషయానికే వస్తే.. అటు చంద్రబాబు.. ఇటు జగన్.. మాదంటే మాదే అధికారం అన్న ధీమాలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఏపీలో పరిస్థితిపై ఓ సర్వే చేయించారట..

Recommended Video

YSRCP To Win AP in 2019 : Survey Reports
సర్వే లెక్కలు..:

సర్వే లెక్కలు..:

రాహుల్ గాంధీ సర్వే లెక్కల ప్రకారం.. ఏపీలో వైసీపీదే విజయం ఖాయమని తేలిపోయిందట. ఆ పార్టీ 110సీట్ల దాకా తమ ఖాతాలో వేసుకోబోతుందని, ఇక టీడీపీ కేవలం 55సీట్లకే పరిమితమైపోతుందని తేలిందట. అంతేకాదు, జిల్లాల వారీగా కూడా సమీకరణాలు భారీగానే మారబోతున్నాయట.

ఈసారి ప.గో వైసీపీదేనట..:

ఈసారి ప.గో వైసీపీదేనట..:


గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడుతాయని రాహుల్ సర్వే తేలినట్లు చెబుతున్నారు. అలాగే గత ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లాలో సత్తా చాటగా.. ఈసారి మాత్రం ఆ ప్రభావం అంతగా ఉండదని తేలిందట.

కర్నూలులో వైసీపీ ఢీలా..:

కర్నూలులో వైసీపీ ఢీలా..:


టీడీపీకి కంచుకోటలుగా ఉన్న తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ ఆ పార్టీ ప్రాభవం బాగానే తగ్గిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించబోతుందని రాహుల్ సర్వేలో వెల్లడైందట. అటు రిపబ్లిక్ టీవి చానెల్ నిర్వహించిన సర్వేలోనూ ఈసారి అధికారం జగన్‌దే అని తేల్చేసిన సంగతి తెలిసిందే.

బాబు సర్వేలు ఇలా..:

బాబు సర్వేలు ఇలా..:

మరోవైపు సీఎం చంద్రబాబు చేయించిన సర్వేల్లో టీడీపీకి తిరుగులేదన్న రీతిలో ఫలితాలు వచ్చినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థల ద్వారా పకడ్బంధీ సర్వే చేయించారన్న వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు చేయించుకున్న సర్వే ఆయనకు అనుకూలంగా రాకుండా ఎలా ఉంటుంది అన్న విమర్శ కూడా లేకపోలేదు.

పాదయాత్ర ఎఫెక్టేనా?..:

పాదయాత్ర ఎఫెక్టేనా?..:

రాహుల్ గాంధీ సర్వేలో వైసీపికి అనుకూల పవనాలు వీచాయంటే.. రాష్ట్రంలో ఆయన పాదయాత్ర ఫలించినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలను జనంలో చర్చకు పెట్టడంలో జగన్ సఫలమవుతున్నారని, అందుకే సర్వేల్లోనూ ఆయనకు అనుకూల ఫలితాలు వెలువడుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.'

English summary
It as been completed the 4 years of lok sabha elections and more one year left for the 2019 general elections , yet the general elections fever is holding the political parties and individuals in the nation as of now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X