వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టికాంగ్రెస్ లిస్ట్, ట్విస్ట్: జయసుధ, విజయశాంతి అసెంబ్లీకి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. అయితే, అభ్యర్థుల ప్రకటన సమయంలో కాంగ్రెసు పార్టీ ట్విస్ట్ ఇచ్చి.. సస్పెన్స్‌కు తెర లేపింది. తెలంగాణలో 16 లోకసభ, 110 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని అధిష్టానం చెప్పింది. పేర్లు చదువుతూనే... అంతలోనే అసెంబ్లీ అభ్యర్థులు లిస్టును పక్కన పెట్టింది.

ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థుల పేర్ల ప్రకటనను ఆపేయాలని ఆహ్మద్ పటేల్ నుండి ఆఐదేశాలు రావడంతో సీన్ రివర్స్ అయింది. మిగతా అభ్యర్థుల ప్రకటనను ఆదివారానికి వాయిదా వేశారు. తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు ఈ నెల 9వ తేదీతో గడువు ముగుస్తుంది. ఎంపీ అభ్యర్థులను మాత్రం కాంగ్రెసు ప్రకటించింది.

Congress releases and withdraws Telangana candidates’ list

అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి హైడ్రామా చోటు చేసుకుంది. జాబితా ప్రకటన ఆకస్మికంగా ఆగిపోయింది. 110 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం నిలిచిపోయింది. ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే విజయశాంతి మినహా సిట్టింగులకు ఓకే చేశారు. శనివారం రాత్రి 10.15 గంటలకు ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా జాబితాను ప్రకటించారు.

ఎంపీ అభ్యర్థులు

సర్వే సత్యనారాయణ - మల్కాజ్‌గిరి
అంజన్ కుమార్ - సికింద్రాబాద్
సామ కృష్ణారెడ్డి - హైదరాబాద్
జైపాల్ రెడ్డి - మహబూబ్‌నగర్
బలరాం నాయక్ - మహబూబాబాద్
కోమటిరెడ్డి రాజగోపాల్ - భువనగిరి
సిరిసిల్ల రాజయ్య - వరంగల్
జి వివేక్ - పెద్దపల్లి
పొన్నం ప్రభాకర్ - కరీంనగర్
మధుయాష్కీ - నిజామాబాద్
నరేష్ జాదవ్ - ఆదిలాబాద్
సురేశ్ షెట్కార్ - జహీరాబాద్
శ్రవణ్ కుమార్ రెడ్డి - మెదక్
కార్తీక్ రెడ్డి - చేవెళ్ల
నంది ఎల్లయ్య - నాగర్ కర్నూల్
గుత్తా సుఖేందర్ రెడ్డి - నల్గొండ

ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

పొన్నాల లక్ష్మయ్య - జనగాం
ఉత్తమ్ కుమార్ రెడ్డి - హుజూర్‌నగర్
దామోదర్ రాజనర్సింహ - ఆందోల్
మల్లు భట్టి విక్రమార్క- మధిర
గజ్జెల కాంతం - చొప్పదండి
అద్దంకి దయాకర్ - తుంగతుర్తి
క్రిశాంక్ - కంటోన్మెంట్
దరువు ఎల్లయ్య - సిరిసిల్ల

మిగిలిన జాబితాలో శ్రీధర్ బాబు (మంథని), ఆకుల లలిత (నిజామాబాద్ అర్బన్), మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), జి వినోద్ (చెన్నూరు), డి శ్రీనివాస్ (నిజామాబాద్ రూరల్), కామారెడ్డి (షబ్బీర్ అలీ), బాల్కొండ (అనిల్), ఆర్మూర్ (కెఆర్ సురేశ్ రెడ్డి), బోధన్ (సుదర్శన్ రెడ్డి), నల్లగొండ (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి), నాగార్జునసాగర్ (జానారెడ్డి), సూర్యాపేట (రాంరెడ్డి దామోదర్ రెడ్డి), నకిరేకల్ (చిరుమర్తి లింగయ్య), భిక్షమయ్య గౌడ్ (ఆలేరు), గద్వాల (డికె అరుణ), వనపర్తి (చిన్నారెడ్డి), జడ్చర్ల (మల్లు రవి), సికింద్రాబాద్ (జయసుధ), కుత్బుల్లాపూర్ (కూన శ్రీశైలం గౌడ్), ఖమ్మం (పువ్వాడ అజయ్), వరంగల్ వెస్ట్ (స్వర్ణ), వరంగల్ ఈస్ట్ (బస్వరాజు సారయ్య), నర్సంపేట (దొంతి మాధవ రెడ్డి), భూపాలపల్లి (గండ్ర వెంకటరమణా రెడ్డి), పాలకుర్తి (దుగ్యాల శ్రీనివాస్), డోర్నకల్ (రెడ్యా నాయక్), మహబూబాబాద్ (కవిత), మెదక్ (విజయశాంతి), దుబ్బాక (చెరకు ముత్యం రెడ్డి), గజ్వేల్ (నర్సారెడ్డి) పటాన్‌చెరు (నందీశ్వర్‌గౌడ్) సంగారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) జహీరాబాద్(జె గీతారెడ్డి) తదితరులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
The announcement of the first list of candidates for Telangana by the Congress on Saturday got suspended halfway, clearly indicating that the protracted consultations, complaints and lobbying for tickets were far from over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X