వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తుల గోల: పాల్వాయి ఇంటి ముందు ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress workers stage dharna in front of Palwai's house
హైదరాబా: కాంగ్రెసు, సిపిఐ మధ్య పొత్తుల వ్యవహారం జిల్లాల్లో గందరగోళానికి దారి తీస్తోంది. పొత్తుల్లో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు స్థానాన్ని సిపిఐకి కేటాయించవద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి నివాసం వద్ద శనివారం ఉదయం మునుగోడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

దీనిపై స్పందించిన పాల్వాయి మునుగోడును సిపిఐకి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిపిఐతో పొత్తు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఆయన అన్నారు. సిపిఐతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం కలుగుతుందని పాల్వాయి తెలిపారు.

అయితే మునుగోడు నుంచి పాల్వాయి కుమార్తె స్రవంతిని పోటీలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయతే ఈ స్థానానికి సిపిఐకి కేటాయించారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో కార్యకర్తలు పాల్వాయి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

మునుగోడును సిపిఐకి కేటాయిస్తే స్రవంతిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపాలని కార్యకర్తలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పాల్వాయి నివాసంలో ముఖ్య అనుచరులతో చర్చలు జరుగుతున్నాయి. స్రవంతి రెడ్డి అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

English summary
Congress workers staged dharna in front of party Rajyasabha member Palwai Govardhan Reddy's residence opposing the allocation of Munugodu seat in Nalgonda district to CPI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X