కానిస్టేబుల్ డాంబికం: ఫొటోలకు ఫోజు, గన్ మిస్‌పైర్
ఏలూరు: ఓ కానిస్టేబుల్ అతికి పోయి ముప్పును కొని తెచ్చుకున్నాడు. అయితే, అదృష్టవశాత్తు ఏమీ నష్టం జరగలేదు. ఎస్‌ఎల్ఆర్ గన్‌తో ఆ కానిస్టేబుల్ గన్‌తో ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. ఈ క్రమంలో గన్ మిస్‌ఫైర్ అయింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారంనాడు చోటు చేసుకుంది.
శనివారంనాడు ఎస్పీ కార్యాలయంలో మొగల్తూరుకు చెందిన చినబాబు విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్ఎల్ఆర్ గన్‌తో ఫోజు ఇచ్చాడు. అతడి సహచరుడు సెల్‌ఫోన్‌తో ఫోటో తీస్తుండగా గన్ మిస్‌ఫైర్ అయింది. తుపాకి శబ్దానికి కార్యాలయంలోని వారంతా బయటకు వచ్చారు. అయితే, ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.

స్వైన్ ఫ్లూతో గర్భిణీ మృతి
విజయనగరం జిల్లా దాసన్నపేట ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి స్వైన్‌ఫ్లూతో శనివారం మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలోని చెస్ట్ ఆస్పత్రిలో ఆమె చేరింది. ఆమెకు స్వైన్‌ఫ్లూ సోకినట్టు అనుమానించిన వైద్యులు శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపించారు. అయితే రిపోర్టులు రాకముందే ఆమె మృతిచెందింజి. ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications