వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాంగ ఉల్లంఘనతోనే వ్యవస్ధల మధ్య సంక్షోభం- మేం నిష్పాక్షికమే- ఏపీ హైకోర్టు సీజే వ్యాఖ్యలు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో చట్ట, న్యాయ, కార్యనిర్వాహక అంశాల మధ్య పలు అంశాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్న వేళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి తన స్వాతంత్ర దినోత్సవ సందేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా ఎవరినీ ప్రస్తావించకుండానే రాజ్యాంగ వ్యవస్ధల మధ్య సంక్షోభాలు తలెత్తడానికి కారణాలను, వాటిని నివారించేందుకు చేయాల్సిన ప్రయత్నాలను న్యాయమూర్తులకు దిశా నిర్దేశం చేశారు.

ఇవాళ హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇందులో ప్రసంగించిన జేకే మహేశ్వరి.. ప్రతీ వ్యక్తికీ తిండీ, బట్టతో పాటు న్యాయం కూడా అందినప్పుడు రాజ్యాంగ ఫలాలు అందినట్లని తెలిపారు. సమాజంలో జనానికి న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్ద జోక్యం తప్పనిసరి అవుతోందన్నారు.
భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురుకాబోతున్నాయని పేర్కొన్నారు. రూల్‌ ఆఫ్‌ లాను న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధలు అమలు చేయాల్సిందేనని జస్టిస్‌ మహేశ్వరి అభిప్రాయపడ్డారు.

constitution borne in mind, there can never be any scope of conflict, says ap highcourt cj

అలాగే వ్యవస్ధల మధ్య సంక్షోభాలకు సాధారణంగా అవకాశం లేదన్నారు. ఎవరైనా సమాజం కోసం దేశం కోసం పనిచేయాల్సిందేనని మహేశ్వరి తెలిపారు. రాజ్యాంగాన్ని గుర్తుంచుకుంటే వ్యవస్ధల మధ్య సంక్షోభం రాదన్నారు. రాజ్యాంగాన్ని ఇతర వ్యవస్ధలు ఉల్లంఘిస్తే మా జోక్యం తప్పనిసరి అవుతుందని గుర్తుచేశారు. ప్రస్తుతం హైకోర్టు నిష్పాక్షికంగానే తన బాధ్యత నిర్వర్తిస్తోందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

Recommended Video

Ram Pothineni సంచలన ట్వీట్స్, ఏదో కుట్ర జరుగుతోందని..!! || Oneindia Telugu
constitution borne in mind, there can never be any scope of conflict, says ap highcourt cj
English summary
andhra pradesh high court chief justice jk maheswari has made crucial comments on this independence day speech today. maheswari says that if constitution borne in mind, there can never be any scope of conflict between its systems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X