విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎక్కడికైనా 30 నిమిషాల్లోనే, అమరావతి చరిత్ర చెప్పే గ్యాలరీ, బాబు ప్లాన్ ఇదే!

ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి తరహాలోనే రాజధానిలో ఏ నిర్మాణాన్నైనా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్దం చేయాలని ఆయన కోరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి తరహాలోనే రాజధానిలో ఏ నిర్మాణాన్నైనా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్దం చేయాలని ఆయన కోరారు.

సీఆర్ డీ ఏ చేపడుతున్న పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. అమరావతికి అభిముఖంగా ఉన్న కృష్ణా నది రాజధానికి ప్రధాన ఆకర్షణగా మారనుందని బాబు చెప్పారు.

అమరావతిలో చేపట్టే నిర్మాణాల విషయంలో రాజీ పడకూదని బాబు అధికారులకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ తరహా నిర్మాణాలున్నాయి. వాటిలో ఏది నాణ్యమైందో సరిచూసుకోవాలన్నారు.

అగ్రశ్రేణి నిర్మాణలన్నీ అమరావతిలో ఉండాలన్నారు. ఈ మేరకు అధికారులు ప్లాన్ చేసుకోవాలని ఆయన సూచించారు.అమరావతికి ఎక్కడెక్కడి నుండి రహదారులు నిర్మించే అవకాశం ఉందో పరిశీలించాలని బాబు సూచించారు.

కూచిపూడి నృత్య భంగిమలో రెండంతస్థులు

కూచిపూడి నృత్య భంగిమలో రెండంతస్థులు

ఇబ్రహీంపట్నంతో అమరావతిని అనుసంధానిస్తూ కూచిపూడి నృత్య భంగిమంలో రెండంతస్థులను నిర్మించాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. వంతెన కాకుండా అమరావతిని చేరుకొనేందుకు కృష్ణానదిపై మరింకెన్ని వారధులు ఎక్కడెక్కడ అవసరమౌతాయో గుర్తించాల్సిందిగా కోరారు. వాటిని సైతం వినూత్నమైన డిజైన్లతో నిర్మించేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు.

అమరావతి సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ఫ్లైఓవర్లు

అమరావతి సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ఫ్లైఓవర్లు

రాజధాని నగరంలో నిర్మించే ఫ్లై ఓవర్లు కూడ అమరావతి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేలా ఉండాలన్నారు. రాజధానిలో అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా డ్రైవర్ లేని విద్యుత్ బస్సులు, మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. జలమార్గాన్ని కూడ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

30 నిమిషాల్లో చేరుకొనేలా రవాణా వ్యవస్థ

30 నిమిషాల్లో చేరుకొనేలా రవాణా వ్యవస్థ

అమరావతిలో ఎక్కడి నుండి ఎక్కడికైనా 30 నిమిసాల్లో చేరుకొనేలా ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటుచేయాలని బాబు అధికారులను ఆదేశించారు. బస్ స్టేషన్లు, మెట్రో రైలు,. పార్కింగ్ ప్రదేశాలు, భూగర్భంలో ఉండేలా చూడాలన్నారు. రింగ్ రోడ్లు, ఇతర రహదారులన్నింటిని వాహానాలు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా ఆయా రంగాల నిపుణులతో చర్చించాలని ఆయన సూచించారు. సైకిల్ మార్గాల్లో, పాదచారులకు ఎక్కడ కూడ ఎండతగలకుండా ఏర్పాటుల్ల చేయాలని ఆయన ఆదేశించారు.

అమరావతి చరిత్ర తెలిపే గ్యాలరీ ఏర్పాటు

అమరావతి చరిత్ర తెలిపే గ్యాలరీ ఏర్పాటు

అమరావతికి చెందిన భూత, భవిష్యత్, వర్తమాన పరిణామాలకు అద్దంపట్టే రీతిలో అమరావతి సీటీ గ్యాలరీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాజధానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో సుమారు 4.5 ఎకరాల్లో రూ13.95 కోట్లతో ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిలో చేపట్టే నిర్మాణాలపై అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకొంటామని ప్రభుత్వం చెబుతోంది.ఈ మేరకు పరకాల ప్రభాకర్, క్యాపిటల్ కమిటీ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది.

పర్యాటక ఆకర్షణలు

పర్యాటక ఆకర్షణలు

విజయవాడలోని రాజీవ్ గాంధీ పార్క్ తో పాటు కృష్ణానది , వివిద కాల్వ గట్ల సుందరీకరణకు రూపొందించిన ప్రణాళికలపై అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. కనకదుర్గమ్మ వారధి నుండి ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వరకు నదికి ఆనుకొని ఉన్న ప్రదేశాన్ని పూర్థిస్తాయిలో సుందరీకరించాలన్నారు సీఎం. పుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, అమ్యూజ్ మెంట్ పార్క్, రోజువారీ ఎగ్జిబిషన్లు, ఫిట్ నెస్ కేంద్రాలు,. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియాలను ఏర్పాటు చేయాలని బాబు సూచించారు.

English summary
Andhra pradesh chief minister Chandrababu naidu ordered to CRDA officers to construct world class buildings in Amaravati.He reviewed on CRDA officers on Wednesday .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X