• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దుబాయ్ శేఖర్ వ్యాఖలపై టీవీ చర్చలో రచ్చ .. చర్చ వాయిదా వేసిన యాంకర్

|

తెలుగు టీవీ చానెళ్లలో జరుగుతున్న చర్చలు సరికొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. చర్చా కార్యక్రమాల్లో నేతలు నియంత్రణ మరచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చ రచ్చ రచ్చగా మారి రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. టైగర్ కెసిఆర్ బయోపిక్ విషయంలో జరిగిన చర్చ లో నేతలు ఘర్షణకు దిగడంతో చర్చ రసాభాసగా మారింది.

 అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే

అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే

కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ తాను తీయనున్నట్లు గా ప్రకటన చేసిన టైగర్ కెసిఆర్ సినిమా కెసిఆర్ బయోపిక్ గా వర్మ తీయనున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే సంచలన ప్రకటన చేసిన వర్మ ఈ సినిమాకు సంబంధించి ఒక పాటను కూడా ప్రకటించారు. ఆంధ్రోడా అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న పాటనే కాదు తన సినిమాతో అంతే కాంట్రవర్సీని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు వర్మ. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా చంద్రబాబు వెన్నుపోటు దారుడు లో చూపించిన వర్మ ఇప్పుడు టైగర్ కేసీఆర్ సినిమాతో కెసిఆర్ ని హీరోలా చూపించాలి అనుకుంటున్నాడు. అయితే ఇదే విషయమై టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిర శోభ మాట్లాడారు.

 దుబాయ్ శేఖర్ వ్యాఖ్యలపై రచ్చ .. చర్చలో దుర్భాషలాడిన టీఆర్ఎస్ నేత

దుబాయ్ శేఖర్ వ్యాఖ్యలపై రచ్చ .. చర్చలో దుర్భాషలాడిన టీఆర్ఎస్ నేత

బయోపిక్ అంటే అన్నీ ఉండాలి. ఆయన జీవితంలోని మంచి చెడు లన్నింటిని ప్రస్తావించాలి అని చెప్తూ కెసిఆర్ ను దుబాయ్ శేఖర్ అనే వారిని, ముంబై శేఖర్ అనే వారిని మరి వర్మ తన సినిమాలో ఈ అంశాన్ని కూడా చూపిస్తారా అంటూ ఆమె మాట్లాడుతుండగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలంగాణా స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ డా. రాకేశ్ ఆమెపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఉద్యమ కాలం నాటి విషయాలను ప్రస్తావించాలి కానీ వ్యక్తిగత విషయాల జోలికి పోవద్దు అంటూ కెసిఆర్ దుబాయ్ శేఖర్ అని మీ అయ్యా చెప్పాడా, మీ అమ్మ చెప్పారా అంటూ ఆమెను ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు.

 నియంత్రణ కోల్పోతున్న నేతలు ..గొడవను కంట్రోల్ చెయ్యలేక టీవీ యాంకర్ అసహనం

నియంత్రణ కోల్పోతున్న నేతలు ..గొడవను కంట్రోల్ చెయ్యలేక టీవీ యాంకర్ అసహనం

ఓ దశలో టీవీ యాంకర్ వీరి మధ్య గొడవను కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.యాంకర్ సైతం తీవ్ర అసహనానికి గురయ్యాడు. దుబాయ్ శేఖర్ అన్న ఒకే ఒక మాటకు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు స్పందించిన తీరు, ఓ మహిళా నాయకురాలు పై మాట్లాడిన విధానం టీవీ యాంకర్ కు సైతం చిరాకు తెప్పించింది. బయోపిక్ అంటే ఆయన జీవితంలోని అన్ని అంశాలు ఉండాలి అన్న క్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభ మాట్లాడారు. కానీ టీవీ చర్చ అన్న విషయం మరచి నియంత్రణ కోల్పోయి రాకేశ్ చర్చలో రచ్చ చేశారు.

చర్చ వాయిదా వేస్తే కానీ సమసిపోని గొడవ

చర్చ వాయిదా వేస్తే కానీ సమసిపోని గొడవ

ఇటీవల టీవీ చర్చా కార్యక్రమాల్లో గతంతో పోలిస్తే మోతాదు పెంచి మరీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా జరిగిన చర్చలో సైతం నేతలు నియంత్రణ కోల్పోయి మాట్లాడిన తీరు నేటి నేతల నియంత్రణ లేని విధానానికి అద్దం పడుతుంది. ఒక దశలో వారి గొడవను కంట్రోల్ చెయ్యలేని యాంకర్ చర్చను వాయిదా వేశారు.

English summary
A big debate on Tiger KCR biopic issue made a controversy in the discussion. congress leader Indira shobha raised about dubai sekhar's issue in the debate . the TRS party leader rakesh screamed on her and told her not to talk about the personnel issue . and he used un parliamentary language and the fight was continued. The anchor couldn't controll the leaders and he postponed the debate .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X