వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలంలో గుప్త నిధుల సంచలనం....తవ్వకాల్లో బైటపడిన పురాతన రాగి యంత్రాలు

|
Google Oneindia TeluguNews

కర్నూలుజిల్లా: కర్నూలు జిల్లాను ఇప్పుడు గుప్తనిధుల మానియా ఊపేస్తోంది. ఒక వైపు చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల కోసమే ప్రభుత్వం తవ్వకాలు నిర్వహిస్తోండగా మరోవైపు శ్రీశైలంలో మట్టిపనులు జరుగుతుండగా రాగి యంత్రాలు బైటపడటం కలకలం రేపింది.

శ్రీశైలంలోని విభూది మఠంలో పురాతన రాగి యంత్రాలు బైటపడటం సంచలనం సృష్టించింది. శ్రీశైలంలో శిథిలావస్థకు చేరిన పంచమఠాల అభివృద్ధిపనులను గత కొన్ని రోజులుగా చేస్తున్నారు. తవ్వకాల్లో మట్టికుండ కనబడడంతో దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు. కుండలో రాగి తాయెత్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గుప్త నిధుల వదంతులు...

గుప్త నిధుల వదంతులు...

అయితే విభూది మఠంలో తవ్వకాల సందర్భంగా గుప్త నిధులు బైట పడ్డాయనే వదంతులు రావడంతో వాటిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో మఠం వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు మట్టికుండ దొరికిన విషయం వాస్తవమేనని, అయితే అందులో గుప్త నిధులు లేవని స్పష్టం చేశారు.

 రాగి యంత్రాలు...తాయెత్తులు

రాగి యంత్రాలు...తాయెత్తులు

తవ్వకాల్లో బైటపడిన మట్టికుండలో రాగి యంత్రాలు మాత్రమే ఉన్నాయని, అవి తాయెత్తులుగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం వాటిని మీడియా ముందు ప్రదర్శించారు.

గతంలో బైటపడిన గుప్తనిధులు...

గతంలో బైటపడిన గుప్తనిధులు...

గతంలో శ్రీశైలంలోనే మల్లికార్జున స్వామి ఆలయం పరిసరాలలో ఉన్నగంటా మఠంలో అభివృద్ది పనులు చేస్తుండగా ముఖద్వారం వద్ద కొన్ని పాత్రలు పనివారి కంటపడ్డాయి. మరింత లోతుగా తవ్వకాలు జరిపినప్పుడు మొత్తం 50 పంచలోహ నాణెములు,147 వెండి నాణెములు, 18 బంగారు నాణెములు, అర కిలోకి పైగా ఉన్న బంగారు కడియాలు, ఒక కుంకుమ భరిణి ఇందులో లభించాయి.

 గుప్త నిధులు ఉన్నాయి...

గుప్త నిధులు ఉన్నాయి...

అయితే మొత్తం మీద పంచమఠాల్లో గుప్త నిధులు ఉన్నాయంటూ స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు. గతంలో బైటపడిన గుప్తనిధులు, తాజాగా బైటపడిన రాగి తాయెత్తులు గుప్త నిధులు ఇక్కడ ఉన్నాయనడానికి నిదర్శనమంటున్నారు. ఇంకా మఠం పనులు జరుగుతుండడంతో ఏమైనా గుప్త నిధులు బయట పడవచ్చునని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
copper yantras have been exposed in Srisailam, at vibhudhi matam. These treasures were articles found at the back of the temple. The authorities are excavated for the development of ancient panchayats for development works. A large number of locals have moved to see the information that has been found to be missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X