హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సామ్‌సంగ్ నకిలీ ఉత్పత్తుల స్వాధీనం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మేధోసంపత్తి హక్కుల అధికారులతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు హైదరాబాదులోని కోటీలో గల గుజరాతి గల్లీలోని ఆంథెమ్ ఆర్కేడ్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వారు సామ్‌సంగ్ నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సామ్‌సంగ్ పేరు మీద నిలువ చేసి, విక్రయించడానికి ఉద్దేశించిన నకిలీ ఉత్పత్తులను వారు స్వాధీనం చేసుకున్నారు.

దాడుల్లో ఫ్లిప్ కవర్లు, ట్యాబ్ కవర్లు, బ్యాటరీలు, హెడ్ ఫోన్స్, బ్లూటూత్, హెడ్ సెట్స్, ట్రావెల్ అడాప్టర్లు, కారు చార్జర్స్, మోనో హెడ్ సెట్స్ వంటి పలు సామ్‌సంగ్ మొబైల్ అనుబంధ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 85 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

మెసర్స్ పిఎస్ మొబైల్ యాక్సెసరీస్‌కు చెందిన అర్జున్ పురోహిత్, మెస్సర్స్ చౌధరీ మొబైల్‌కు చెందిన దినేష్ కుమార్‌ను, మెస్రస్ రామ్‌దేవ్ మొబైల్ యాక్సెస్సరీస్‌కు చెందిన కైలాస్ చౌధరిని, మెస్సర్స్ ఆశాపుర మొబైల్ యాక్సెసరీస్‌కు చెందిన నరపత్‌లాల్‌ను పోలీసులు అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (డిటెక్డివ్ విభాగం) డిప్యూటీ పోలీసు కమిషన్ జి. పాలపరాజు సారథ్యంలో సిసిఎస్ పోలీసు ఇన్‌స్పెక్టర్స్ (నార్కోటిక్ సెల్) విజయ్ సింగ్, ఎం శంకర్ దాడులు నిర్వహించి నకిలీ సామ్‌సంగ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ ఉత్పత్తుల స్వాధీనం

నకిలీ ఉత్పత్తుల స్వాధీనం

హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఇఐపిఆర్ అధికారుల సహకారంతో కోఠీలోని గుజరాతీ గల్లీలో దాడులు నిర్వహించి సామ్‌సంగ్ నకిలీ అనుబంధ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

విలువ రూ. 85 లక్షలు

విలువ రూ. 85 లక్షలు

పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ ఉత్పత్తుల విలువ 85 లక్షల రూపాయల మేరకు ఉంటుందని అంచనా వేశారు.

దాడులు చేసి స్వాధీనం

దాడులు చేసి స్వాధీనం

సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గుజరాతీ గల్లీలోని ఆంథెమ్ ఆర్కేడ్‌పై దాడి చేశారు. ఈ సమయంలో పెద్ద యెత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

గుంపు ఇలా..

గుంపు ఇలా..

గుజరాతీ గల్లీలో ప్రజలు పెద్ద యెత్తున తమకు కావాల్సిన ఉత్పత్తులను కొంటుంటారు. పోలీసుల దాడి సందర్భంగా ప్రజలు ఇలా గుమికూడారు.

అరెస్టు, ఎఫ్ఐఆర్ నమోదు

అరెస్టు, ఎఫ్ఐఆర్ నమోదు

పోలీసులు వివిధ దుకాణాలపై దాడులు నిర్వహించి, వాటి యజమానులను అరెస్టు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గుజరాతి గల్లీలో ఇలా...

గుజరాతి గల్లీలో ఇలా...

పోలీసుల దాడి సందర్భంగా ప్రజలు ఆంథెమ్ ఆర్కేడ్ వద్ద పెద్ద యెత్తున గుమికూడారు. పోలీసులు నకిలీ సామ్‌సంగ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Hyderabad Central Crime Station along with Enforcers of Intellectual Property Rights (EIPR) conducted enforcement action at Anthem Arcade, Gujarathi Gally, Koti and seized duplicate products that were being stored and sold under the brand name of Samsung.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X