ఏపీలో కరోనా ఉధృతి..గత 24 గంటల్లో 2,331 కేసులు, 11 మరణాలు..ఆ జిల్లాలలో అత్యధికం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారతదేశంలో రోజువారి కరోనా కేసుల ఈరోజు 1,15 వేలకు పైగా నమోదయ్యాయి . ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,331 మంది కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గుంటూరు జిల్లాలో 368 కేసులు, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31,812 నమూనాలను పరీక్షించగా 2,331 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,13,274 గా నమోదయింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో పదకొండు మంది మృతి చెందారు.

గత 24 గంటల్లో కరోనా కారణంగా పదకొండు మంది మృతి
చిత్తూరు జిల్లాలో నలుగురు ,కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం, కృష్ణా , తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరూ చొప్పున మొత్తం 11 మంది కరోనా బారిన పడి మరణించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 7,262 కు చేరుకుంది. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులను చూస్తే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 కేసులు, ఆ తర్వాత స్థానంలో కృష్ణాజిల్లాలో 327 కేసులు, విశాఖపట్నంలో 298 కేసులు, చిత్తూరు జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసులివే
అనంతపురం లో 202 కేసులు, నెల్లూరులో 186, కర్నూలులో 176, వైఎస్ఆర్ కడప జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో 123 కేసులు, ప్రకాశం జిల్లాలో 110 కేసులు ,విజయనగరంలో 47 కేసులు ,తూర్పుగోదావరి జిల్లాలో 29 కేసులు నమోదు కాగా పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 20 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో కరోనా నుండి 853 మంది కోలుకున్నారు.

9 లక్షలకు చేరుకుంటున్న యాక్టివ్ కేసుల సంఖ్య
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 8, 97 ,736 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షలకు చేరువగా ఉంది . ప్రస్తుతం 13,276 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1, 53 ,02,583 నమూనాలను పరీక్షించారు. ఇటీవల కాలంతో పోలిస్తే ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య ఈరోజు భారీగా పెరిగిందని చెప్పాలి.