వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్ .. ఏపీ స్కూల్స్ జూన్ 11 వరకు క్లోజ్ ? తర్జనభర్జనల్లో సర్కార్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మరి. ఇక ఈ మహమ్మారిపై తెలుగు రాష్ట్రాలు పోరాటం చేస్తున్నాయి. ఇక ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఢిల్లీ నిజాముద్దీన్ సభకు వెళ్లి వచ్చిన వారికి చాలా మందికి కరోనా పాజిటివ్ రావటంతో ఈ సంఖ్య ఒక్కసారిగా అనూహ్యంగా పెరిగింది. ఇప్పటికి ఏపీలో తాజా లెక్కల ప్రకారం 303 కేసులు నమోదు అయ్యాయి. ఇక కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ఏప్రిల్ 15 తో ముగియనుంది. ఇక ఈ సమయంలో స్కూల్స్ విషయంలో ముఖ్యంగా సందిగ్ధం నెలకొంది.

కరోనాపై యుద్ధంలో టీటీడీ సైతం .. వెంటిలేటర్లు , వైద్య పరికరాల కొనుగోలుకు రూ.19 కోట్ల భారీ విరాళంకరోనాపై యుద్ధంలో టీటీడీ సైతం .. వెంటిలేటర్లు , వైద్య పరికరాల కొనుగోలుకు రూ.19 కోట్ల భారీ విరాళం

లాక్ డౌన్ ఎత్తివేస్తే స్కూల్స్ నిర్వహించాలా వద్దా ? సందిగ్ధంలో ఏపీ సర్కార్

లాక్ డౌన్ ఎత్తివేస్తే స్కూల్స్ నిర్వహించాలా వద్దా ? సందిగ్ధంలో ఏపీ సర్కార్

తాజాగా పెరిగిన కేసుల ప్రకారం లాక్ డౌన్ మరింత కొనసాగిస్తారా అన్నది ప్రస్తుతానికి తెలీలేదు. కానీ ఒకవేళ లాక్ డౌన్ తొలగిస్తే స్కూల్స్ నడపాలా వద్దా అన్న సందిగ్ధంలో పడింది ఏపీ సర్కార్ . లాక్ డౌన్ ఎత్తివేత అంత సులువు కాదని భావిస్తున్న సర్కార్ తదుపరి కార్యాచరణలు సిద్ధం చేస్తోంది. అయితే లాక్ డౌన్ ఎత్తివేసినా లేదా సడలించినా స్కూల్స్ నిర్వహించటం మంచిది కాదనే భావన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే స్కూల్స్ లో విద్యార్థులు సోషల్ డిస్టెన్స్ పాటించరు. అందరూ గుంపులుగా ఉంటారు.

స్కూల్స్ కొనసాగింపులో ఒక ఇబ్బంది .. స్కూల్స్ క్లోజ్ చేస్తే ఒక ఇబ్బంది

స్కూల్స్ కొనసాగింపులో ఒక ఇబ్బంది .. స్కూల్స్ క్లోజ్ చేస్తే ఒక ఇబ్బంది

ఒకవేళ లాక్ డౌన్ ముగిసే నాటికీ కొత్త కేసులు నమోదు కాకుండా అక్కడికి ఆగిపోతే ప్రభుత్వానికి కాసింత ఊరట . లేకుంటే లాక్ డౌన్ ఎత్తివేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది . ఈ సమయంలో ముఖ్యంగా పాఠశాలలు తెరుచుకునే అవకాశం మాత్రం కనిపించట్లేదు. పాఠశాలలు తెరిస్తే విద్యార్ధులు గుమిగూడతారు కాబట్టి మూసివేయడమే మంచిదని ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం . ఇక విద్యా సంవత్సరంలో అకాడిమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. ఒకవేళ అలా కాకుండా కొనసాగించటానికి మంచి మండుటెండల కాలం . ఇక ఆసమయంలో స్కూల్స్ నడిపించటం విద్యార్థులకు శ్రేయస్కరం కాదు .

వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కోసం వ్యూహాలు రచించిన సర్కార్

వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కోసం వ్యూహాలు రచించిన సర్కార్

ఈ నెల 14 తర్వాత స్కూల్స్ తెరిచినా ఆదివారాలు పోను కేవలం ఏడు రోజులు మాత్రమే స్కూల్స్ కొనసాగే అవకాశం ఉంది . ఇక ఇప్పటికే విద్యార్థులకు ఎలాంటి టెన్షన్ లేకుండా 9వ తరగతి వరకు విద్యార్ధులను పరీక్షలు లేకుండా పాస్ చేసేశారు కాబట్టి జూన్ 11వ తేది వరకు స్కూళ్లను మూసి వేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది . ఇక వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్న సర్కార్ అందుకు తగ్గట్టు విద్యార్థులను ఇప్పటి నుండే ప్రిపేర్ చేయించాలని నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే వచ్చే విద్యా సంవత్సరానికి ఇంగ్లీషు మీడియంలో పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తీసుకు వస్తున్న సర్కార్ ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి మారితే అర్ధం చేసుకోవటం కష్టం అవుతుందని ముందే వారికి బేసిక్స్ నేర్పించాలని నిర్ణయం తీసుకుంది.

Recommended Video

Lockdown : Central Government Planning To Extend The Lockdown!
జూన్ 11వ తేది వరకు స్కూల్స్ క్లోజ్ ? .. సమాలోచనల్లో ఏపీ ప్రభుత్వం

జూన్ 11వ తేది వరకు స్కూల్స్ క్లోజ్ ? .. సమాలోచనల్లో ఏపీ ప్రభుత్వం

కానీ కరోనా ప్రభావంతో కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల అది సాధ్యం కాలేదు . స్కూళ్లు రీ ఓపెన్ చేసే సరికి విద్యార్థుల్లో ఏ టెన్షన్ లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని భావించిన సర్కార్ కు వూహించని ఉపద్రవం వచ్చి పడింది . ఇక ఏపీ ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరానికి ఇంగ్లీష్ బ్రిడ్జి కోర్సు కూడా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. కానీ అది కూడా సాధ్యం కాలేదు . ఇక ఈ సమయంలో ఏంచెయ్యాలి .. విద్యార్థులకు ఏది ఉపయుక్తం అన్న కోణంలో ఆలోచిస్తున్న సర్కార్ జూన్ 11 వరకు సెలవులు కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న విషయంలో తర్జన భర్జన పడుతుంది .

English summary
Lifting the lock down can cause a lot of trouble. At this time, there is no chance of schools opening. It is reported that the government is thinking of closing down the schools so that the students can gather. According to the academic calendar of the school year, schools will work until the 23rd of this month. It is not good for the students to run schools in this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X