వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్: చికెన్,మటన్ షాపుల్లో ఆఫర్స్..రీజన్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

ఒకపక్క ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంటే దాని ప్రభావం తెలుగురాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా చికెన్ , మతాన్ మార్కెట్లు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. జంతు మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండటంతో చికెన్ , మటన్ తినాలంటేనే భయపడుతున్నారు ప్రజలు . ఇక ఇదే సమయంలో కోనసీమలో జంతువులకు ప్రబలిన కొత్త రకం వైరస్ హెర్సిస్ అనే వైరస్ జంతువులకు బాగా ప్రబలుతూ పశువుల ప్రాణాలు తీస్తుంది. దీంతో కూడా ఏపీలో భారీగా చికెన్, మటన్ అమ్మకాలు పడిపోయాయి. తినేవారు లేక మటన్, చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ .. చికెన్, మటన్ బంద్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ .. చికెన్, మటన్ బంద్

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంది. ముఖ్యంగా భారతదేశంలో తెలుగురాష్ట్రాలు సైతం కరోనా విషయంలో భయాందోళనలో ఉన్నారు . ఇక కరోనా మాత్రమే కాకుండా ఏపీలో హెర్సీస్ వైరస్ వల్ల లంపి స్కిన్ అనే వ్యాధితో జంతువులు, పక్షులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్న పరిస్థితుల్లో అక్కడ జంతువులకు వస్తున్న జబ్బును చూసి కరోనా అని భయపడుతున్న పరిస్థితి. ఇక మటన్, చికెన్ తింటే కరోనా వస్తుందని జరిగిన ప్రచారం వ్యాపారులకు బాగా దెబ్బ కొట్టింది.

చికెన్ , మటన్ తింటే కరోనా వస్తుందని ప్రచారం .. అలాంటిదేమీ లేదంటున్న అధికారులు

చికెన్ , మటన్ తింటే కరోనా వస్తుందని ప్రచారం .. అలాంటిదేమీ లేదంటున్న అధికారులు

అధికారులు ప్రజలలో కరోనా వైరస్ విషయంలో అవగాహన కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రజల్లో భయం మాత్రం పోవటం లేదు . చికెన్ , మటన్ తింటే కరోనా వైరస్ వస్తుందని అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు ఊపందుకున్న నేపధ్యంలో అధికారులు చికెన్ , మటన్ తింటే ఏమీ కాదని క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రజల్లో ఈ అపోహ మాత్రం పోలేదు. దీంతో చికెన్, మటన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ధరలు సైతం పడిపోయాయి .

బంపర్ ఆఫర్లు ...5 కిలోల మటన్ కొంటె హెల్మెట్ ఫ్రీ

బంపర్ ఆఫర్లు ...5 కిలోల మటన్ కొంటె హెల్మెట్ ఫ్రీ

ఇక ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు మాంసం విక్రయాలను చేస్తున్న షాపుల వాళ్ళు , ఈ పరిస్థితి నుండి గట్టెక్కటానికి ఆఫర్లు పెడుతున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు మటన్ షాప్ వ్యాపారులు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నారు. చికెన్ , మటన్ కొనుగోలు చేసిన వారికి బంపర్ ఆఫర్ అంటూ బట్టల షాపులలో ఆఫర్లు ఇచ్చినట్టు వారిని ఫాలో అవుతున్నారు. 5 కిలోల మటన్ కొంటె హెల్మెట్ ఫ్రీ అంటూ నందిగామలో ఒక మటన్ షాపులో ఆఫర్ పెట్టి మరీ అమ్ముతున్నారు.

Recommended Video

Hersis Virus : New Virus In Andhra Pradesh ! | Oneindia Telugu
ఆఫర్లు పెట్టి మటన్, చికెన్ విక్రయిస్తున్న షాపులు

ఆఫర్లు పెట్టి మటన్, చికెన్ విక్రయిస్తున్న షాపులు

చికెన్ కొంటె కోడిగుడ్లు ఫ్రీ వంటి ఆఫర్లు , మటన్ కొంటె హెల్మెట్ ఫ్రీ వంటి ఆఫర్లు ఇస్తున్నా ప్రజలు మాత్రం చికెన్ , మటన్ కొనుగోళ్ళు భారీగా తగ్గించేశారు . ఇక ఈ నేపధ్యంలో కరోనా భయం నుండి బయటపడేది ఎప్పుడో ... చికెన్ ,మటన్ కొనుగోళ్ళు యధావిధిగా కొనసాగేది ఎప్పుడో అన్నది వేచి చూడాల్సిందే .

English summary
The impact of coronavirus on the world. Especially in India, Telugu states are also in a panic. Not only the corona, but also the fear of another virus due to the disease of lumpy skin people of AP stooped eating non veg . The propaganda that if anybody eats Mutton and Chicken corona virus will be aattck ... is a big drawback for non veg traders. So, they giving offers to public on chicken, mutton trading to survive in thier business .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X